Share News

రక్తదానం ప్రాణదానంతో సమానం

ABN , Publish Date - Oct 29 , 2024 | 12:45 AM

పెద్దాపురం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక సీహెచ్‌సీ, రోటరీ క్లబ్‌, సహ కారంతో రోటరీ బ్లడ్‌ బ్యాంక్‌ వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారం

రక్తదానం ప్రాణదానంతో సమానం
పెద్దాపురంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాజప్ప, డీఎస్పీ

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక సీహెచ్‌సీ, రోటరీ క్లబ్‌, సహ కారంతో రోటరీ బ్లడ్‌ బ్యాంక్‌ వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆపద సమయంలో రక్తం ఎంతో అవసరమవుతుందన్నారు. పోలీసులు కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా సమాజానికి ఉపయోగపడే విధంగా రక్తదాన శిబిరాల్లో రక్తదానం చేసి ఎంతోమందిని కాపాడుతున్నారని పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. డీఎస్పీ డి.శ్రీహరి రాజు మాట్లాడుతూ పోలీసులు రేపటి తరాల భవి ష్యత్తుకు ప్రాణత్యాగాలు చేశారన్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పెద్దాపురం, సామ ర్లకోట సీఐలు టి.క్రాంతికుమార్‌, ఏ.కృష్ణభగవాన్‌, ఎస్సై మౌనిక, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 12:45 AM