Share News

ఆయిల్‌పామ్‌ పంటల సాగును విస్తరించాలి

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:45 PM

ప్రత్తిపాడు, ఆగస్టు 28: ఆయిల్‌పామ్‌ రైతులకు అన్నివిధాలుగా ఉద్యానవనశాఖ ఏపీ ఆయి ల్‌ ఫెడ్‌లు, ప్రోత్సాహకాలు అందిస్తుందని లాభదాయకమైన ఈ పంటలసాగును రైతులు విస్తరించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా కోరారు. స్థానిక లయన్స్‌ కమ్యూనిటీ హాల్లో బుధవారం ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల ఆయిల్‌పామ్‌ రైతులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవ

ఆయిల్‌పామ్‌ పంటల సాగును విస్తరించాలి
ప్రత్తిపాడులో ఆయిల్‌పామ్‌ రైతులకు మొక్కలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

ప్రత్తిపాడు, ఆగస్టు 28: ఆయిల్‌పామ్‌ రైతులకు అన్నివిధాలుగా ఉద్యానవనశాఖ ఏపీ ఆయి ల్‌ ఫెడ్‌లు, ప్రోత్సాహకాలు అందిస్తుందని లాభదాయకమైన ఈ పంటలసాగును రైతులు విస్తరించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా కోరారు. స్థానిక లయన్స్‌ కమ్యూనిటీ హాల్లో బుధవారం ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల ఆయిల్‌పామ్‌ రైతులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులకు 2023 -24 సంవత్సరానికి గాను మొక్కల పెంపకానికి 40శాతం, మొదటి సంవత్సరం మొక్కల నిర్వహణకు 483 మంది రైతులకు రూ.81లక్షలు వారి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు ఆయిల్‌పామ్‌ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మైనింగ్‌, ఇరిగేషన్‌ అధికారి జీ.వరప్రసాద్‌, ని యోజకవర్గ కూటమి నాయకులు కొమ్ముల కన్నబాబు, వరుపుల రామకృష్ణ ఎస్‌.సీతారాం, మది నే దొరబాబు, రీసు సత్తిబాబు, సుబ్బారావు, ము త్యాల రాంబాబు, మదినే వీరభద్రం, ఉద్యాన అధికారిణి ఎ.శ్రీవల్లి, పి.అరుణ్‌, ఏపీ ఆయిల్‌ఫెడ్‌ రీజనల్‌ అధికారి జి.జగదీశ్వర రెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధి పరుగులు పెట్టించాలి

రౌతులపూడి, ఆగస్టు 28: వైసీసీ చీకటి పాలన రోజులు పోయాయని.. ఇక గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని అధికారులు, ప్రజా ప్ర తినిధులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా సూచించారు. రౌతులపూడిలో మండల పరిషత్‌ కార్యాలయం నందు ఎంపీపీ గంటిమళ్ల రాజ్యా లక్ష్మి అధ్యక్షతన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మూలగపూడిలో వైద్యులు అందు బాటులో ఉండడంలేదని సర్పంచ్‌ తమరాల సత్యనారాయణ తెలిపారు. పి.చామవరం సర్పం చ్‌ నందమూరి రాజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:45 PM