AP Elections: ‘సీ విజిల్’ యాప్‌లో ఫిర్యాదు.. వైసీపీ అభ్యర్థి గిఫ్ట్ ఆఫర్స్ సీజ్
ABN , Publish Date - May 08 , 2024 | 10:42 AM
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు నేతలు. నగదు, మద్యం, చీరలు, రకరకాల వస్తువులను ఇచ్చి ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటికి చెక్‌పెట్టేందుకు ఈసీ, పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇలాంటి ప్రలోభాలను అడ్డుకునేందుకు ఈసీ, పోలీసులతో కలిసి అన్ని రకాల చర్యలు చేపట్టింది.
కృష్ణాజిల్లా, మే 8: ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు నేతలు. నగదు, మద్యం, చీరలు, రకరకాల వస్తువులను ఇచ్చి ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటికి చెక్‌పెట్టేందుకు ఈసీ, పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇలాంటి ప్రలోభాలను అడ్డుకునేందుకు ఈసీ, పోలీసులతో కలిసి అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ‘సీ విజిల్’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈసీ.. ఎన్నికల్లో అక్రమాలపై నేరుగా ఈయాప్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది.
PM Modi Live: వేములవాడలో ప్రధాని మోదీ బహిరంగ సభ
తాజాగా... పెనమలూరు వైసీపీ అభ్యర్థి జోగి రమేష్‌పై (YSRCP Candidate Jogi Ramesh) సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు వచ్చింది. దీంతో గత రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు హుటాహుటిన తనిఖీలు చేపట్టారు. ఎంవీఆర్ గార్డెన్స్ ఫ్లాట్ నెంబర్ 27కు చేరుకున్న సిబ్బంది.. తాళం వేసి ఉన్న ఇంటిలోకి ప్రవేశించడానికి గంటన్నర సమయం పట్టింది. పెనమలూరు పోలీసుల సహకారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించింది. వైఎస్సార్సీపీకి సంబంధించిన మెటీరియల్స్, పింగాణి సెట్స్, ఫ్లాస్కుస్ తదితర వస్తువుల గిఫ్ట్ హంపర్స్‌ను అధికారులు గుర్తించారు. అలాగే జోగి రమేష్ ఫోటోలతో ముద్రించిన క్యాప్స్, టీ షర్ట్స్, పార్టీకి సంబంధించిన కిట్ బ్యాగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. సుమారు వీటి విలువ అక్షరాల ఐదు లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఓటర్లకు చేరవేసే ప్రక్రియలో భాగంగా నిలువ చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
AP Elections: నెల్లూరులో వైసీపీ ఎదురీత.. కంచుకోట కూలుతోందా..!?
Mayawati: అల్లుణ్ని తొలగించిన మాయావతి
Read Latest AP News And Telugu News