Mla Pinnelli: హౌస్ అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకున్నారు..?
ABN , Publish Date - May 22 , 2024 | 04:10 PM
ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. హౌస్ అరెస్ట్‌లో ఉండగా పిన్నెల్లి సోదరులు ఎలా తప్పించుకుంటారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిలదీశారు.
పల్నాడు జిల్లా: ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. హౌస్ అరెస్ట్‌లో ఉండగా పిన్నెల్లి సోదరులు ఎలా తప్పించుకుంటారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (prathipati pulla rao) నిలదీశారు. పిన్నెల్లి సోదరులు పారిపోతుండగా పోలీసులు ఏం చేస్తున్నారని అడిగారు. ఇంట్లో ఉన్న వారు తప్పించుకోవడం వీలవుతుందా..? అని ప్రశ్నించారు. నిజంగా పోలీసులకు చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని కోరారు. అలా కాకుండా లేరు, తప్పించుకున్నారని కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రతిపాటి పుల్లారావు అన్నారు. హింస చెలరేగినా అదుపులోకి తీసుకురావడంలో సీఎస్, డీజీపీ విఫలం అయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటలనకు వారు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిందని గుర్తుచేశారు. సీఈసీ నుంచి ఆదేశాలు వస్తే కానీ అరెస్ట్ చేయాలనే స్పృహ రాష్ట్రంలోని అధికారులు, పోలీసులకు లేకపోవడం విచారకరమని ప్రతిపాటి పుల్లారావు అభిప్రాయ పడ్డారు.
ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చని ప్రతిపాటి పుల్లారావు అభిప్రాయ పడ్డారు. ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేస్తే ఇన్ని రోజులు ఎందుకు ఉపేక్షించారని నిలదీశారు. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకుండా శాశ్వతంగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
For more Election News and Telugu News