AP Politics: సర్వేపల్లిలో మితిమీరిన మంత్రి కాకాణి అల్లుడు ఆగడాలు: మాజీమంత్రి సోమిరెడ్డి
ABN , Publish Date - Apr 10 , 2024 | 02:54 PM
సర్వేపల్లి నియోజకవర్గంలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆయన అల్లుడు ఆగడాలు పెరిగిపోయాయని వివరించారు.
నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) మండిపడ్డారు. సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy), ఆయన అల్లుడు ఆగడాలు పెరిగిపోయాయని వివరించారు. మంత్రి కాకాణి ఆధ్వర్యంలో దోపిడీ జరుగుతుందని ఆడియోలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బయట పెట్టారు. నియోజకవర్గంలో 7 వేల ఎకరాల భూమి అందజేశామని చెబుతున్నారు.. ఆ వివరాలు మండల కార్యాలయాల్లో డిస్ ప్లే చేయాలని కోరారు. శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నామని చెబుతూ.. దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీలో చేరినవారికి బెదిరింపులు
తెలుగుదేశం పార్టీలో చేరుతున్న నేతలను బెదిరిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు. మనుబోలు మండలంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి వార్నింగ్ ఇచ్చారని గుర్తుచేశారు. మంత్రి కాకాణి అల్లుడు భూ దోపిడీకి అడ్డూ అదుపు లేదని మండిపడ్డారు. అల్లుడి కోసం రామదాసు కండ్రిగలో బినామీ కంపెనీకి 56 ఎకరాల భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. ఆ భూమి విలువ రూ.కోట్లలో ఉంటుందని స్పష్టం చేశారు.
పట్టాలు ఇంట్లో పెట్టుకొని
పేదల పట్టాలు ఇంట్లో పెట్టుకొని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి బెదిరిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో చేరితే పట్టా ఇవ్వనని బెదిరింపులకు పాల్పడుతున్నారని గుర్తుచేశారు. వైసీపీలో చేరాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వివరించారు. సర్వేపల్లి బ్లాక్ మెయిల్ కేంద్రంగా మారిందని సోమిరెడ్డి మండిపడ్డారు. సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి భూ దోపిడీకి సంబంధించి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామని వివరించారు. సర్వేపల్లిలో మంత్రి కాకాణి, అతని అల్లుడి ఆగడాలపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి కోరారు.
ఇది కూడా చదవండి:
TDP: సీఎం జగన్‌కు నారా లోకేష్ సవాల్..
మరిన్ని ఏపీ వార్తల కోసం