AP Politics: ‘విజయానంద రెడ్డి ఓ స్మగ్లర్.. చిత్తూరు ప్రజలు అసలు నమ్మరు’
ABN , Publish Date - Apr 21 , 2024 | 12:38 PM
Andhra Pradesh: చిత్తూరు(Chittoor) వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డిపై(Yijayananda Reddy) తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ కుమార్(Varun Kumar) నిప్పులు చెరిగారు. స్మగ్లర్‌ను చిత్తూరు ప్రజలు నమ్మరని, మహామహులు పుట్టిన చిత్తూరు ప్రాంతానికి ఓ స్మగ్లర్‌ను అసెంబ్లీకి పంపించే గతి పట్టలేదని వరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
Andhra Pradesh: చిత్తూరు(Chittoor) వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డిపై(Yijayananda Reddy) తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ కుమార్(Varun Kumar) నిప్పులు చెరిగారు. స్మగ్లర్‌గా అభివర్ణించారు. స్మగ్లర్‌ను చిత్తూరు ప్రజలు నమ్మరని, మహామహులు పుట్టిన చిత్తూరు ప్రాంతానికి ఓ స్మగ్లర్‌ను అసెంబ్లీకి పంపించే గతి పట్టలేదని వరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అసలు విజయానంద రెడ్డి నాయకుడే కాదని, నాయకుడిగా వైసీపీ నాయకులు ప్రొజెక్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కే చిత్తూరు ప్రజలు పట్టం కడతారని, ఇదే జరుగుతుందని వరుణ్ జోస్యం చెప్పారు.
‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ పాట రాసిన శంకరంబాడి సుందరాచారి పుట్టిన గడ్డ, గురువులకే గురువు, భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ చదువు చెప్పిన ఊరు, విద్యావేత్త చిన్నంరెడ్డి ఎమ్మెల్యేగా సేవలందించిన నేలపై ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ను, లిక్కర్, లాటరీ, బెట్టింగ్ వ్యవహారాలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న నీచమైన వ్యక్తికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీటిచ్చారని వ్యాఖ్యానించారు. విజయానంద రెడ్డిని ఎల్ఎల్‌బీ అని ముద్దుగా స్థానికులు పిలుచుకుంటారన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాకు సంబంధించి 15 కేసులు ఆయనపై ఉన్నాయన్నారు. కేసుల్లో చిక్కుకుని.. పోలీసులకు పట్టుబడకుండా 20 రోజుల పాటు ఒక విమానం నుంచి ఇంకో విమానం మారుతూ, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారుతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: 65 సిక్స్‌లు, 53 ఫోర్లు.. చివరి ఓవర్‌లో ధోనీ విధ్వంసం..
తిరుమల వనసంపదను దోచుకున్న వ్యక్తి విజయానంద రెడ్డి అని మండిపడ్డారు. చోటామోటా స్మగ్లర్లకు లీడర్ లాంటి విజయానంద రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు, పీలేరు జైలులో శిక్ష అనుభవించాడన్నారు. జైలులో వీఐపీ ట్రీట్మెంట్ కూడా పొందారని విమర్శించారు. ఇలాంటి స్మగ్లర్‌నా మనం అసెంబ్లీకి పంపిచాల్సి వస్తోందని చిత్తూరు వాసులు తలపట్టుకుంటున్నారని వరుణ్ వ్యాఖ్యానించారు.