Share News

YS Sharmila: రూ.3 వేల కోట్ల నిధి ఏమైంది.. సీఎం జగన్‌పై షర్మిల నిప్పులు

ABN , Publish Date - Apr 25 , 2024 | 07:59 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

YS Sharmila: రూ.3 వేల కోట్ల నిధి ఏమైంది.. సీఎం జగన్‌పై షర్మిల నిప్పులు
YS Sharmila

పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శలు కొనసాగుతోన్నాయి. రూ.3 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. పల్నాడులో జరిగిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.


అంబటి రాంబాబు లిక్కర్ డాన్ అని వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. ‘నియోజకవర్గంలో మద్యం అమ్మకాల్లో 33 శాతం వాటా ఆయనకు ఇవ్వాలట. అంబటి రాంబాబు వంటి ఎమ్మెల్యేలు అవసరమా.? గత ఎన్నికల్లో గెలిచిన అంబటి రాంబాబు మీకు ఏమైనా చేశారా..? నీటిపారుదలశాఖ మంత్రిగా అంబటి రాంబాబు ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా..? కనీసం కాలువల్లో మట్టి కూడా తీయలేదు. ఉన్న ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతుంటే చర్యలు లేవు. నియోజక వర్గం మొత్తం మట్టి మాఫియా, ఇసుక మాఫియా రాజ్యమేలుతుంది. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి..? తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం అని’ వైఎస్ షర్మిల హామీనిచ్చారు.

Jagan Vs CBN: ‘ఎంత నీచం’ అంటూ జగన్‌కు చంద్రబాబు దిమ్మదిరిగే కౌంటర్


Read Latest
Andhra Pradesh News And Telugu News


Updated Date - Apr 25 , 2024 | 07:59 PM