Share News

AP Elections: పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ.. పట్టించుకోని పోలీసులు...

ABN , Publish Date - May 07 , 2024 | 03:28 PM

Andhrapradesh: వైసీపీ అభ్యర్థి, మంత్రి ఉషశ్రీ చరణ్‌కు జీహుజూర్ అన్నట్లు ప్రవర్తించారు పెనుకొండ పోలీసులు. మంగళవారం జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలోకి అనుచరులను వెంటబెట్టుకుని వచ్చిన వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ.. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగిస్తున్న ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించారు. అయితే అనుచరులను వెంటబెట్టుకుని ఉషశ్రీ పోలింగ్ స్టేషన్‌లోకి ..

AP Elections: పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ.. పట్టించుకోని పోలీసులు...

శ్రీ సత్యసాయి జిల్లా, మే 7: వైసీపీ అభ్యర్థి, మంత్రి ఉషశ్రీ చరణ్‌కు (YSRCP Candidate Ushasri Charan) జీహుజూర్ అన్నట్లు ప్రవర్తించారు పెనుకొండ పోలీసులు (Penukonda Police). మంగళవారం జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలోకి అనుచరులను వెంటబెట్టుకుని వచ్చిన వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ.. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగిస్తున్న ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించారు. అయితే అనుచరులను వెంటబెట్టుకుని ఉషశ్రీ పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లడంపై టీడీపీ నేతలు (TDP Leaders) తీవ్ర అభ్యంతరం తెలిపారు.

ఏపీలో పెను సంచలనం.. దుమారం రేపుతున్న తాజా సర్వే.. సోషల్ మీడియాలో వైరల్..!


మరోవైపు వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి పోలింగ్ కేంద్రం ఆవరణలో తిష్ట వేసినప్పటికీ సీఐ యుగంధర్, ఎస్సై రంగడు యాదవ్ పట్టించుకోని పరిస్థితి. అంతేకాకుండా అభ్యంతరం తెలిపిన టీడీపీ నేతలు, కార్యకర్తలపైనే సీఐ ఆగ్రహంతో ఊగిపోయారు. జాగ్రత్తగా ఉండాలంటూ టీడీపీ నేతలను తీవ్ర స్థాయిలో సీఐ బెదరింపులకు గురిచేశారు. దీంతో సీఐ యుగంధర్ తీరుపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!


విషయం తెలిసిన వెంటనే టీడీపీ అభ్యర్థి సవితమ్మ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పట్ల సీఐ యుగంధర్ వ్యవహార తీరుపై టీడీపీ అభ్యర్థి మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ, ఆమె భర్త శ్రీచరణ్ పోలింగ్ కేంద్రంలో ఉంటే ఏం చేస్తున్నారంటూ సవితమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

Delhi Liquor Scam: కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్.. జ్యూడీషియల్ కస్టడీ పొడగింపు..

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ముగిసిన కవిత జ్యుడీషియల్ కస్టడీ

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 03:32 PM