Share News

Gautham Sawang-APPSC: గౌతమ్ సవాంగ్ కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 03 , 2024 | 10:05 PM

డీజీపీగా రాష్ట్ర పోలీసు వ్యవస్థను వైఎస్సార్‌సీపీకి దాసోహం చేసి.. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్‌గా విమర్శలకు గురైన గౌతమ్‌ సవాంగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

Gautham Sawang-APPSC: గౌతమ్ సవాంగ్ కీలక ప్రకటన
Gautham Sawang

అమరావతి: డీజీపీగా రాష్ట్ర పోలీసు వ్యవస్థను వైఎస్సార్‌సీపీకి దాసోహం చేసి.. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్‌గా విమర్శలకు గురైన గౌతమ్‌ సవాంగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఆయన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించింది.


వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన గౌతమ్ సవాంగ్‌పై గతంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అమరావతికు వెళ్లగా వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీనిని కవర్ చేస్తూ నిరసన తెలిపేందుకే రాళ్లు విసిరారంటూ వెనకేసుకొచ్చారు. ఈ వ్యవహారంపై అప్పట్లో ఆయన తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

Updated Date - Jul 03 , 2024 | 10:09 PM