Abdul Nazeer: సవాళ్లు ఎదురైనా అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తోంది..
ABN , Publish Date - Jan 26 , 2024 | 12:37 PM
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని లిఖించిన వారి స్ఫూర్తిని నింపుకుని మన ప్రజాస్వామ్యం మరింత పరిడవిల్లాలలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గవర్నర్ అన్నారు.
విజయవాడ: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని లిఖించిన వారి స్ఫూర్తిని నింపుకుని మన ప్రజాస్వామ్యం మరింత పరిడవిల్లాలలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గవర్నర్ అన్నారు. సవాళ్లు ఎదురైనా రాష్ట్రం వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తోందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వరాజ్య మైదానంలో 206 అడుగుల ఎత్తైన సమతా మూర్తి అంబేద్కర్ విగ్రహాన్ని అవిష్కరించుకున్నామన్నారు. 56 నెలల్లో మన ప్రభుత్వం గ్రామ స్థాయి వరకూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చిందని అబ్దుల్ నజీర్ కొనియాడారు.
‘‘15004 గ్రామ, వార్డు సచివాలయలు, 10,132 విలేజ్ క్లినిక్‌లు, 10,778 రైతు భరోసా కేంద్రాలు, 12,979 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీ లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఇంటింటికీ ప్రభుత్వం సేవలు అందిస్తోంది. 9260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ల ద్వారా ఇంటింటికీ రేషన్ ఇస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఆరోగ్య శ్రీ కార్డులతో పాటు, ఒక కోటి ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలను ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం ఇచ్చింది.
వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం , జిల్లాల పునర్వవస్తీకరణలో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. పేదలు ధనికుల మధ్య అంతరాన్ని తొలగించేలా పారదర్శక పాలనను ప్రభుత్వం అందిస్తోంది. విద్యావైద్యంలో గణనీయమైన మార్పులు తెచ్చింది నా ప్రభుత్వం. టోఫెల్ తో పాటు అంతర్జాతీయ కోర్సుల అమలు కోసం ఈడేక్స్ సంస్థతో ఒప్పందం కుదిరింది. ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత చికిత్స పరిధిని 25 లక్షలకు ప్రభుత్వం పెంచింది. మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు సామాజిక పెన్షన్‌ను నా ప్రభుత్వం రూ.3 వేలకు పెంచింది.
గత 56 నెలల్లో వివిధ వర్గాలకు 84,731 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించింది. నగదు బదిలీ పథకాల ద్వారా ఇప్పటికీ నా ప్రభుత్వం 2,52,943 కోట్లు నాన్ డీబిటి ద్వారా మరో 1,68,151 కోట్లు వెచ్చించింది. ప్రతీ గ్రామానికి 20 లక్షల నిధులు విడుదల చేసింది. నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 16 వేల కోట్లతో 4 ఓడరేవుల నిర్మాణం చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు పూర్తిపై ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని అబ్దుల్ నజీర్ కొనియాడారు.