Share News

Buddha Venkanna: కొడాలి నాని ఊరు వదిలి పో.. లేదంటే..!!

ABN , Publish Date - Jun 22 , 2024 | 11:25 AM

గత ప్రభుత్వ హయాంలో చెలరేగిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ డెడ్ లైన్ విధించింది. ఊరు వదిలిపెట్టి పోవాలని తమదైన శైలిలో హెచ్చరించింది. పెళ్లాం, పిల్లలతో.. పెట్టె బెడ సర్దుకొని వెళ్లాలని హుకుం జారీచేసింది. లేదంటే వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది.

Buddha Venkanna: కొడాలి నాని ఊరు వదిలి పో.. లేదంటే..!!
Buddha Venkanna

అమరావతి: గత ప్రభుత్వ హయాంలో చెలరేగిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ డెడ్ లైన్ విధించింది. ఊరు వదిలిపెట్టి పోవాలని తమదైన శైలిలో హెచ్చరించింది. పెళ్లాం, పిల్లలతో.. పెట్టె బెడ సర్దుకొని వెళ్లాలని హుకుం జారీచేసింది. లేదంటే వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కొడాలి నాని రెచ్చిపోయారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రభుత్వం మారడంతో కొడాలి నాని తదితరులకు గడువు ఇచ్చింది. ఆ గడువు దాటడంతో టీడీపీ నేత బుద్దా వెంకన్న ( Buddha Venkanna) స్పందించారు.


వదిలేది లేదు..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేసేవారిని వదిలిపెట్ట బోమని బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు. కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ, జోగి రమేష్ లాంటి వారు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే బుద్ది చెబుతామని స్పష్టం చేశారు. కొడాలి నాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నానికి ఇచ్చిన గడువు ముగిసింది. పెళ్లాం, పిల్లలతో ఊరు వదిలి వెళితే మంచిది. అలా వెళితే వదిలేస్తాం అని స్పష్టం చేశారు. కాదు కూడదని.. ఇక్కడే ఉంటూ... పిచ్చి ప్రేలాపనలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.


రెచ్చిపోయిన నాని అండ్ కో

గత ప్రభుత్వంలో కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రులుగా పనిచేశారు. వంశీ, జోగి రమేష్ ఎమ్మెల్యేలుగా కొనసాగారు. సమయం చిక్కితే చాలు చంద్రబాబు, లోకేశ్ లక్ష్యంగా విమర్శలు చేసే వారు. ప్రభుత్వం మారిన వారి తీరు మారలేదు. విమర్శలు చేయడంతో చూస్తూ ఊరుకోబోమని బుద్దా వెంకన్న హెచ్చరించారు. ఏకంగా ఊరు వదిలి వెళ్లిపోవాలని సూచించారు. అలా అయితే వదిలేస్తాం అని.. ఇక్కడే ఉండి పిచ్చి పిచ్చిగా చేస్తే తగిన రీతిలో బుద్ది చెబుతామని హెచ్చరించారు.

Updated Date - Jun 22 , 2024 | 11:25 AM