TDP: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు హౌస్ అరెస్ట్
ABN , Publish Date - May 16 , 2024 | 12:58 PM
పల్నాడు: జిల్లాలో 144 సెక్షన్ నేపథ్యంలో గుంటూరులో టీడీపీ కీలక నేతలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ అభ్యర్థులు జూలకంటి బ్రహ్మారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావులను హౌస్ అరెస్టు చేశారు. ఇలా చేయడం సరికాదని నక్కా ఆనందబాబు అన్నారు.
పల్నాడు: జిల్లాలో 144 సెక్షన్ (144 Section) నేపథ్యంలో గుంటూరులో టీడీపీ కీలక నేతలను (TDP Leaders) హౌస్ అరెస్టు (House Arrest) చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (Nakka Anandababu), టీడీపీ అభ్యర్థులు జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahma Reddy), యరపతినేని శ్రీనివాసరావులను (Yarapatineni Srinivasarao) హౌస్ అరెస్టు చేశారు. ఇలా చేయడం సరికాదని నక్కా ఆనందబాబు అన్నారు. మాచర్ల (Macharla) అల్లర్లపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) కమిటీ ఏర్పాటు చేశారని, అందులో సభ్యుడుగా ఉన్న ఆనంద బాబు ఉన్నారు. ఈ క్రమంలో మాచర్ల పరామర్శలకు వెళ్లకుండా ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ పోలీసులు ఇంకా వింతపోకడలు మానుకోవడంలేదని, త్వరలోనే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని వాళ్లకు చెప్పినట్లు తెలిపారు. హింసాత్మక ఘటనలు ఎక్కడ జరుగుతున్నాయి. ఎవరు ప్రేరేపిస్తున్నారు.. పక్క జిల్లాల నుంచి గుండాలు, సంఘ విద్రోహశక్తులను రప్పించి గొడవలు సృష్టిస్తున్నారని.. వాళ్లపై పోలీసులు యాక్షన్ తీసుకోకుండా.. శాంతి భద్రతలు పరిరక్షించకుండా.. మమ్మలి హౌస్ అరెస్టు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. సంఘ విద్రోహశక్తులంతా పల్నాడు జిల్లాలో ఉన్నారని, వైసీపీ నేతలుగా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీటన్నింటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని నక్కా ఆనందబాబు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో నలుగురు ఎస్పీలపై ఈసీ వేటు..?
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంలో విచారణ
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు..
మోసం చేసిన ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి..!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News