Share News

Kakani Govardhan Reddy:కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేము భయపడం

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:05 AM

కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే తాము భయపడమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారని తెలిపారు.

Kakani Govardhan Reddy:కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేము భయపడం

నెల్లూరు జిల్లా: కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే తాము భయపడమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారని తెలిపారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. వరుసగా నాలుగు సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారని చెప్పారు.


ALSO Read: AP News: నల్లచట్టాలను రద్దు చేసే వరకు పోరుబాట: సుంకర రాజేంద్రప్రసాద్

అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. సీఎం చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేశారని దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారని ప్రశ్నించారు.చాలాచోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని అన్నారు. కానీ పిన్నెల్లి పై మాత్రమే కేసు పెట్టారని చెప్పారు. అందుకే ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉందని తెలిపారు.


చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయన బంధువులు. కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. శ్రేయోభిలాషులు అందరూ తల్లడిల్లి పోయారని తెలిపారు. ఏది ఏమైనా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నామని అన్నారు. పిన్నెల్లిపై మరిన్ని కేసులు నమోదు చేసి మళ్లీ జైలుకు పంపించాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.


చంద్రబాబు ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో అవన్నీ మళ్లీ పునరావృతమవుతాయన్నారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లు అధికారులు చేయొద్దన్నారు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతే ఆయన కోడుకుతో పాటూ హైదరాబాద్ కు వెళ్లిపోతారని ఆరోపించారు.


అధికారులు ఇక్కడే ఉండాల్సి ఉంటుందని చెప్పారు.వంద రోజుల్లో మంచి పాలన అందిస్తానని చెప్పిన చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసులు.. అరెస్టులు.. జైళ్లకు భయపడమని అన్నారు. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఎదురవు తున్నాయని కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

KTR : కేటీఆర్ వ్యాఖ్యలు.. రాజుకున్న వివాదం.. మహిళ కమిషన్ ముందుకు కేటీఆర్

Pinnelli: జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి.. హడావుడిగా మాచర్లకు పయనం

విశ్వమిత్ర భారత్‌కే ఇరుగు పొరుగు బలిమి

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 24 , 2024 | 11:33 AM