YS Sharmila: కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక
ABN , Publish Date - Mar 21 , 2024 | 04:44 PM
విజయవాడలోని ‘ఆంధ్రరత్న’ భవన్‌లో కడప నేతలతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సమావేశం ముగిసింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే కడప నుంచైనా పోటీకి సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే తనతో సహా ఏ స్థాయిలో ఉన్న నేత అయినా పోటీకైనా, త్యాగానికైనా సిద్దంగా ఉండాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు.
విజయవాడ: విజయవాడలోని ‘ఆంధ్రరత్న’ భవన్‌లో కడప నేతలతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సమావేశం ముగిసింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే కడప నుంచైనా పోటీకి సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే తనతో సహా ఏ స్థాయిలో ఉన్న నేత అయినా పోటీకైనా, త్యాగానికైనా సిద్దంగా ఉండాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు.
సజ్జల గారూ.. ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు...
‘‘ నేనే కాదు.. రఘువీరారెడ్డి, ఇతర ముఖ్య నేతలు అయినా అధిష్ఠానం ఆదేశాలు పాటిస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా మా గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారు?. మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలంతా సిద్దంగా ఉన్నారు సజ్జల గారూ. పోలవరం, రాజధాని, స్టీల్ ఫ్యాక్టరీ, హోదా కోసం కాంగ్రెస్ మాత్రమే పోరాటం చేస్తోంది. అవినాశ్ రెడ్డి అనే వ్యక్తి జగన్‌కు సొంత కజిన్. వైసీపీలో ఉండి కూడా అవినాశ్ రెడ్డి కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎందుకు పోరాటం చేయలేదు?. దీనిపై సజ్జల, జగనన్న కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అధిష్ఠానం ఆమోదం తర్వాత త్వరలోనే కాంగ్రెస్ జాబితా ఉంటుంది’’ అని వైఎస్ షర్మిల చెప్పారు.
వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామంటూ 1500 దరఖాస్తులు అందాయని ఈ సందర్బంగా షర్మిల తెలిపారు. అన్నింటినీ పరిశీలిస్తున్నామని, సర్వేలు జరుగుతున్నాయని, అభ్యర్థులు ఇంకా ఫైనల్ కాలేదని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి
Chintamaneni: ఏ ముఖం పెట్టుకుని జగన్ బస్సు యాత్ర అంటున్నారు?
Chandrababu: 99 శాతం హామీల అమలంటున్న జగన్ మాటలు బూటకం
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి