AP Politics: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో.. రాబోయే ఎన్నికల్లో పోటీకి బీజేపీ కీలక నేత
ABN , Publish Date - Mar 15 , 2024 | 05:35 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన - బీజేపీ (Telugu Desam - Janasena - BJP) పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో వేగం పెంచాయి. పొత్తులో భాగంగా అభ్యర్థులను ప్రకటిస్తూ టీడీపీ - జనసేన దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే రెండు జాబితాలను ఈ రెండు పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే.
విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన - బీజేపీ (Telugu Desam - Janasena - BJP) పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో వేగం పెంచాయి. పొత్తులో భాగంగా అభ్యర్థులను ప్రకటిస్తూ టీడీపీ - జనసేన దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే రెండు జాబితాలను ఈ రెండు పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కూటమిలోని కమలం పార్టీకి సంబంధించి మూడు, నాలుగు రోజుల్లో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ తరపున పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. కేంద్ర హై కమాండ్‌ను ఇప్పటికే రాష్ట్రంలోని కొంతమంది నేతలు కలిసి తమకు టికెట్ ఇవ్వాలని విన్నవించారు. అధిష్ఠానం కూడా కొంతమంది పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ - జనసేన- బీజేపీ పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ బీజేపీ (BJP) కి కేటాయించినట్లు సమాచారం. ఇక్కడ నుంచి బబ్బూరి శ్రీరామ్ టికెట్ తనకు ఇవ్వాలని అధిష్ఠానానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. కేంద్ర బీజేపీ నేతలు కూడా బబ్బూరి శ్రీరామ్ పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో ఆయన పేరు ముందువరుసలో ఉన్నట్లు సమాచారం. తనకు టికెట్ ఇవ్వాలని బబ్బూరి శ్రీరామ్ కోరుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ నేతలు అడ్డూరి శ్రీరామ్, మరికొంతమంది ఈ సీటును ఆశిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో బీజేపీ జాబితా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎవరిని ఎంపిక చేస్తారోనని బీజేపీ నేతలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి