AP: డబ్బులు ఇవ్వకపోతే చంపుతాం.. వర్రా గ్యాంగ్‌పై మరో ఎస్సీ, ఎస్టీ కేసు..
ABN , Publish Date - Nov 14 , 2024 | 09:33 AM
సోషల్ మీడియా సైకోలపై రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. వర్ర రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై మరో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అసలేం జరిగిందంటే..
కడప : పులివెందుల పోలీస్టేషన్లో సోషల్ మీడియా సైకోలపై రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. వర్ర రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై మరో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సిద్దవటం మండలానికి చెందిన జనసేన కార్యకర్త వెంకటాద్రి అనే దళత వ్యక్తి ఈ ముగ్గురిపై ఫిర్యాదు చేశారు.
డబ్బులు ఇవ్వకపోతే..
పవన్ కళ్యాణ్‌పై అసభ్యంగా పోస్టులు పెట్టగా తొలగించమని అడిగితే కులం పేరుతో తనను వర్రా గ్యాంగ్ దూషించి డబ్బులు డిమాండ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించినట్లు వెంకటాద్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వర్రా గ్యాంగ్‌పై పోలీసులు మరో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
అవినాష్ మెడకు ఉచ్చు..
వైసీపీ సోషల్ మీడియా సైకోల ఫ్యాక్టరీపై పోలీసులు దర్యా ప్తు వేగవంతం చేశారు. వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తోంది. పరారీలో ఉన్న ఎంపీపీఏ రాఘవ రెడ్డిని విచారించాక ఎంపీ అవినాష్‌పై కూడా కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. తనపై, తన కుటుంబంపై అసభ్య పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి మరికొందరిపై... నేడో రేపో వైఎస్ వివేకా కమార్తె సునీత రెడ్డి పులివెందుల పీఎస్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది.