106 సెక్షనను రద్దు చేయాలి
ABN , Publish Date - Jan 10 , 2024 | 10:57 PM
డ్రైవర్లకు మరణదండనగా మారిన 106 సెక్షనను వెంటనే రద్దు చేయాలని హెచపీసీఎల్ ట్యాంకర్స్ డ్రైవర్స్ అసోసియేషన అధ్యక్షుడు షరీఫ్ హుస్సేన డిమాండ్ చేశారు.
సిద్దవటం, జనవరి 10 : డ్రైవర్లకు మరణదండనగా మారిన 106 సెక్షనను వెంటనే రద్దు చేయాలని హెచపీసీఎల్ ట్యాంకర్స్ డ్రైవర్స్ అసోసియేషన అధ్యక్షుడు షరీఫ్ హుస్సేన డిమాండ్ చేశారు. మం డలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న హెచపీసీఎల్‌లో బుధవారం హెచపీసీఎల్ ట్యాంకర్స్ డ్రైవ ర్స్ అసోసియేషన ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీ డ్రైవర్లు ఎక్కువ శాతం పేద వర్గాలకు చెందిన వారే నని, ఈ సెక్షనతో వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ లారీ డ్రైవర్స్ అసోసియేషన్స ఈ నెల 10 నుంచి 14 వరకు బంద్‌కు పిలుపునిచ్చిందన్నారు. వారికి మద్దతుగా హెచపీసీఎల్ ట్యాంకర్స్ డ్రైవర్స్ అసోసియేషన బంద్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన నాయకులు వేమారెడ్డి, సుబ్బారెడ్డి, దస్తగిరి, నాగూర్, ఆరిఫ్, రమణ తదితరులు పాల్గొన్నారు.