Share News

మైలవరం జలాశయం నుంచి నీరు విడుదల

ABN , Publish Date - Aug 30 , 2024 | 11:32 PM

మైలవరం జలాశయం నుంచి ఉత్తరకాలువకు 50 క్యూసెక్కుల నీటిని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇనచార్జ్‌ భూపేష్‌రెడ్డిలు శుక్రవారం విడుదల చేశారు.

మైలవరం జలాశయం నుంచి నీరు విడుదల
మైలవరం ఉత్తరకాలువకు నీటిని విడుదల చేసిన దృశ్యం

మైలవరం/బ్రహ్మంగారిమఠం, ఆగస్టు 30: మైలవరం జలాశయం నుంచి ఉత్తరకాలువకు 50 క్యూసెక్కుల నీటిని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇనచార్జ్‌ భూపేష్‌రెడ్డిలు శుక్రవారం విడుదల చేశారు. ముందుగా మైలవరం జలా శయం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గండికోట జలాశయానికి ఇప్పటికే 18 టీఎంసీల నీరు వచ్చి చేరిందని, అక్కడి నుంచి మైలవరం జలాశయానికి 7500 క్యూసెక్కుల మేర నీరు వచ్చి చేరుతోందన్నారు. నియోజకవర్గంలో నెల కొన్న వర్షాభావం దృష్ట్యా ఉత్తరకాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, దక్షిణ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారన్నారు. పెన్నా పరివాహక ప్రాంత ప్రజల తాగు, రైతుల సాగు నీటి కోసం ఇబ్బందులు పడ కుండా చూడడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మరో 10 రోజుల్లో పెన్నానదికి మైలవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జలాశయ ఈఈ పురుషోత్తం, డీఈఈ నరసింహమూర్తి, ఏఈఈ గౌతమ్‌రెడ్డి, తహసీల్దారు లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీని వాసులు తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మంసాగర్‌లోకి కృష్ణాజలాలు

తెలుగుగంగలో అంతర్భా గమైన బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టులోకి గురువారం అర్ధరాత్రి 12గంటల సమయంలో కృష్ణాజలాలు చేరాయని తెలు గుగంగ ప్రాజెక్టు అసిస్టెంటు ఇంజనీరు నాగేశ్వర్‌రావు తెలి పారు. కృష్జాజలాలు వెలుగోడు ప్రాజెక్టు నుంచి ఎస్‌ఆర్‌-1, ఎస్‌ఆర్‌-2 పూర్తిస్థాయిలో నిండి బ్రహ్మంసాగర్‌కు వెయ్యి క్యూసెక్కులు నీళ్లు వస్తున్నాయన్నారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో కూడా నీరు ఎక్కువగా ఉండడంతో ఈ సారి బ్రహ్మంసాగర్‌లోకి పూర్తిస్థాయి నీటి మట్టం 15 టీఎంసీలు నిల్వ ఉంచే ప్రక్రియలో అధికారులు నిమగ్నమై ఉన్నారని.. రైతన్నలు వ్యవసాయానికి ఈ సారి పూర్తిస్థాయిలో నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు.

Updated Date - Aug 30 , 2024 | 11:32 PM