PSR Anjaneyulu IPS: ఆ అధికారికి అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు..
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:53 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో ఒకరు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు. ఐపీఎస్ అధికారి అయిన పీఎస్‌ఆర్ ఆంజనేయులను గత వైసీపీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీఎస్‌ఆర్ ఆంజనేయులపై..
ఐపీఎస్ ఎంతో ఉన్నతమైన ఉద్యోగం.. పోలీస్ శాఖలో అత్యున్నతమైన స్థానం. ఐపీఎస్ అధికారులకు తమ గోడు చెప్పుకుంటే న్యాయం చేస్తారని ప్రజలు ఆశ పడతారు. అంతేకాదు ఐపీఎస్ అధికారులను ఎంతో గౌరవిస్తారు. ఓ రకంగా చెప్పాలంటే ఐపీఎస్ అంటే ఓ ప్రజా సేవకుడు.. ఉద్యోగంలో చేరినప్పటినుంచి కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా.. రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేసే అధికారి. అందుకే ఐపీఎస్ ఉద్యో్గం అంటే వెరీ పవర్ ఫుల్ అంటారు. కానీ కొందరు మాత్రం ఐపీఎస్ ఉద్యోగాన్ని అయ్యా ఎస్‌గా మార్చేశారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ చట్టాన్ని అతిక్రమిస్తూ.. నిబంధనలు తుంగలో తొక్కుతూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సంఘటనలు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో చూశాం.. గత జగన్ ప్రభుత్వంలో కొందరు ఐపీఎస్ చీకటి బాగోతాలు బయటకు వస్తున్నాయి. తమను నమ్ముకున్న ప్రజల కోసం కాకుండా.. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల మెప్పుకోసం పని చేసిన ఐపీఎస్‌లు ప్రస్తుతం తగిన మూల్యాన్ని చెల్లించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో ఒకరు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు. ఐపీఎస్ అధికారి అయిన పీఎస్‌ఆర్ ఆంజనేయులను గత వైసీపీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీఎస్‌ఆర్ ఆంజనేయులపై మహిళల విషయంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. తన ఉద్యో్గాన్ని అడ్డుగా పెట్టుకుని పీఎస్‌ఆర్ ఆంజనేయులు సాగించిన చీకటి బాగోతాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి.
Ration Mafia: తిరువూరులో రెచ్చిపోతున్న రేషన్ బియ్యం మాఫియా..
అందమైన అమ్మాయి కనిసిస్తే చాలు..
ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.అయితే పీఎస్‌ఆర్ ఆంజనేయులు కేవలం జత్వానినే కాదని.. ఎంతోమంది మహిళలను వేధించారని, తన మాట వినకపోతే ఎన్నో ఇబ్బందులు పెట్టేవారని సీపీఎం నాయకురాలు రమాదేవి ఏబీఎన్ మార్నింగ్ డిబేట్‌లో ఆరోపించారు. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఆయన మనసు పడేవారని, గతంలోనూ ఎన్నో ఆరోపణలు ఐపీఎస్ అధికారి ఆంజనేయులపై ఉన్నాయన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చినవారిని ఆయన వదిలిపెట్టేవారు కాదని.. అందమైన మహిళ కనిపిస్తే తన కోరిక తీర్చేవరకు వేధిస్తూనే ఉండేవారన్నారు.
Pedana: పెడనలో 144 సెక్షన్ విధించిన పోలీసులు
ఎందరో బాధితులు..
ఐపీఎస్ అధికారిగా ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన పీఎస్‌ఆర్ ఆంజనేయులు అవ్వన్నీ మర్చిపోయి.. మహిళలను లైంగికంగా.. శారీరకంగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. పీఎస్‌ఆర్ ఆంజనేయులు బాధితులు దాదాపు వందల సంఖ్యలో ఉంటారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో.. ఆయన బాధితులు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు.
Dr Chandrasekhar Pemmasani: ‘సమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News Click Here