CM Chandrababu: అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం ఆదేశాలు
ABN , Publish Date - Dec 21 , 2024 | 10:25 AM
Andhrapradesh: అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. సీఎంవో అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై వివరణ ఇచ్చారు.
అమరావతి, డిసెంబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలకు పంటపొలాలు నీటమునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట నేలరాలడంతో రైతుల బాధ వర్ణణాతీతం. అలాగే వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
జెస్సీరాజ్ క్రీడలకు గౌరవం తెచ్చారు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
మరోవైపు ఉత్తరాంధ్రలో వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. సీఎంవో అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై వివరణ ఇచ్చారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు.. స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎంకు అధికారులు వివరించారు.
కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. వర్షాల అనంతరం పంటనష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికిప్పుడు రైతులకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
గత మూడు రోజులుగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. విజయనగరం జిల్లాలో వరి, మామిడి, పెసర, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లాలోని మండలాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు 30.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అటు శ్రీకాకుళం జిల్లాలోనూ పంట పొలాలు నీట మునిగాయి. కుప్పల కింద నీరు చేరడంతో ధాన్యానికి మొలకులు వచ్చేశాయని రైతులు వాపోతున్నారు. వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన కూరగాయల లోడ్లు తక్కువగా రావడంతో డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయల ధరలు స్వల్పంగా పెరిగాయి.
ఇవి కూడా చదవండి..
నిధుల మంజూరు, ఇతర పనులపై ఆరోపణలు
Read Latest AP News And Telugu News