Share News

Shock for YCP: వైసీపీకి మరో షాక్.. తిరువూరు ఎమ్మెల్యే రాజీనామా!

ABN , Publish Date - Jan 11 , 2024 | 01:30 PM

ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తిరువూరు వైసీపీ సీట్ తనకి రాదని సమాచారం రావటంతో మనస్తపం చెందిన రక్షణ నిధి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది.

Shock for YCP: వైసీపీకి మరో షాక్.. తిరువూరు ఎమ్మెల్యే  రాజీనామా!

ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తిరువూరు వైసీపీ సీటు తనకి రాదని సమాచారం రావటంతో మనస్తాపం చెందిన రక్షణ నిధి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. స్వామిదాస్‌కు తిరువూరు వైసీపీ తరపున టికెట్ ఇస్తే పార్టీమారే యోచనలో ఆయన ఉన్నారు. శుక్రవారం తిరువూరు వచ్చి రక్షణ నిధి తన నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం.

ఎమ్మెల్యే రక్షణ నిధి గత 15 రోజులుగా తిరువూరు రాకుండా వల్లూరుపాలెంలోనే మకాం వేశారు. రక్షణ నిధితో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్‌లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బుధవారం, ఈ రోజు ఉదయం కూడా రక్షణ నిధిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా ససేమిరా అన్నారు. ఉమ్మడి కృష్ణ జిల్లా టీడీపీ నేతలు రక్షణ నిధితో రాయభారం చేసినట్లు సమాచారం. పార్ధసారధి బాటలో వైసీపీని వీడి టీడీపీలో వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సామజిక మధ్యమాల్లో వార్త హల్ చల్ చేస్తోంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Jan 11 , 2024 | 02:15 PM