Share News

CM Chandrababu: వారి పాలన చూశారు.. ఇప్పుడు దానికి భిన్నంగా చేసి చూపుతాం

ABN , Publish Date - Jul 25 , 2024 | 03:30 PM

Andhrapradesh: రాష్ట్రంలో 2019-24 మధ్య దయనీయంగా మారిన శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీశ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అమరావతికి ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చినందుకు 2525మందిని అరెస్టు చేశారని తెలిపారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం కార్యక్రమంలో రోడ్డుపై భోజనం చేసేలా చేశారన్నారు.

CM Chandrababu: వారి పాలన చూశారు.. ఇప్పుడు దానికి భిన్నంగా చేసి చూపుతాం
CM Chandrababu Naidu

అమరావతి, జూలై 25: రాష్ట్రంలో 2019-24 మధ్య దయనీయంగా మారిన శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu naidu) గురువారం అసెంబ్లీశ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అమరావతికి ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చినందుకు 2525మందిని అరెస్టు చేశారని తెలిపారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం కార్యక్రమంలో రోడ్డుపై భోజనం చేసేలా చేశారన్నారు. అరసవెల్లి వెళుతుంటే దాడి చేసి అడ్డుకున్నారన్నారు. జగన్ మీటింగ్‌లకు వెళ్లే వారి బ్లాక్ చున్నీలను తీయించి పంపడం ఇలా... ఎన్ని అరాచకాలు చేయాలనుకున్నారో అన్ని చేశారని సీఎం విమర్శించారు.

Chandrababu: శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు


వారి పాలన ప్రజలు చూశారని.. ఇప్పుడు దానికి భిన్నంగా మనం ఉండాలన్నారు. దేవాలయాలపై దాడులు చేశారని అన్నారు. అంతర్వేదిలో రథాన్ని అంటించి కథలు చెప్పారని మండిపడ్డారు. రాముడి తల తీయడం, వెండి సింహాలు దొంగిలించారన్నారు. ఎన్నికల అక్రమాలు, బోగస్ కార్డులు తయారు చేశారన్నారు. స్ధానిక ఎన్నికలు అన్ని ఏకగ్రీవం చేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ కమీషనర్ కేంద్రం నుంచి రక్షణ కోరారని సీఎం తెలిపారు. హూ కిల్డ్ బాబాయ్ మొదట హార్ట్ఎటాక్ అన్నారని... తరువాత లోకల్ ఎంపీ, గంగిరెడ్డి, జగన్ రోడ్డు జర్నిలో వెళ్లారని.. గ్యాంగ్ ఆర్డర్ తెచ్చారన్నారు. సునీతను కూడా నమ్మించారన్నారు. చివరకు నిందితుడు అని భావిస్తున్న ఎంపీని అరెస్టు కూడా చేయనివ్వలేదని తెలిపారు.


కోడికత్తి డ్రామా,గులకరాయి డ్రామాలు ఆడారన్నారు. కల్తీ మద్యం, గంజాయి విషయంలో అప్పటి ముఖ్యమంత్రి ఒక్కరోజు అయినా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. గంజాయిని ఎట్టిపరిస్ధితుల్లో నియంత్రణ చేస్తామని స్పష్టం చేశారు. అలవాటు పడ్డవారు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఏజెన్సీలో వారు గంజాయి సాగు చేయ్యొద్దని అడుగుతున్నానన్నారు. నేరస్తులే ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో గత అయిదేళ్లు చూశామన్నారు. ‘‘చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఎప్పుడైనా చూసారా? నేను నలభై అయిదు ఏళ్ళలో ఎవ్వరిని చూడలేదు. ఎస్కోబార్ కొలంబియన్ డ్రగ్ లార్డ్ ఆయన రాజకీయ నాయకుడు అయ్యి డ్రగ్ కారిడార్‌లు ఏర్పాటు చేశాడు. 30 బిలియన్ డాలర్లు సంపాదించి 1977లో అరెస్టు అయ్యాడు.

YS Jagan: పోలవరం జాప్యానికి జగన్ కారణం.. పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్రం



1982లో కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు. అమెరికా అరెస్టు చేయాలనుకుంటే మంచి ప్రిజన్ అతనే కట్టుకొని అక్కడే ఉంటానన్నడు. తరువాత కొలంబియా న్యాయమంత్రిని 1986లో చంపాడు... తరువాత 1987లో సుప్రీంకోర్టు పై దాడి చేసి 11 మంది జడ్జిలనుతో పాటు ఎంతో మందిని చంపాడు’’ అని వెల్లడించారు. వికసిత్ భారత్ ద్వారా భారత్ ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే శక్తి ఉందన్నారు. అమెరికాలో కమలా హ్యరీస్‌తో పాటు ఉపాధ్యాక్షురాలిగా పోటీచేస్తోంది భారతీయురాలు అని అన్నారు. ఎవ్వరు రాజకీయాల్లో ఉన్నా పర్వాలేదని.. అయితే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదనేది తన భావన అని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం.. టాటా, రిలయన్స్, అదాని కంటే ఎక్కవ డబ్బు సంపాదించాలనుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Bhuvaneshwari: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై భువనమ్మ ఏం చెప్పారంటే?

Madanapalle Fire Accident: మదనపల్లి కేసులో కీలక ఆధారాలు లభ్యం

Read Latest AP News And Telangana News

Updated Date - Jul 25 , 2024 | 04:31 PM