Share News

TDP: గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారు: డోలా బాల వీరాంజనేయస్వామి

ABN , Publish Date - Jun 26 , 2024 | 12:54 PM

అమరావతి: టీడీపీ నేత డోలా బాల వీరాంజనేయస్వామి, సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖా మంత్రిగా బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాక్‌లో మంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని చెప్పారు.

TDP: గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారు: డోలా బాల వీరాంజనేయస్వామి

అమరావతి: టీడీపీ నేత (TDP Leader) డోలా బాల వీరాంజనేయస్వామి (Dola Bala Veeranjaneyaswamy), సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖా మంత్రిగా బుధవారం సచివాలయం (Secretariat)లోని మూడవ బ్లాక్‌లో మంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తనపై ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని, తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. 2014-19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అధనపు సీట్లు ఇచ్చామని, గత ప్రభుత్వంలో జగన్ ఆ సీట్లను రద్దు చేశారని ఆరోపించారు.


అవి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1600 ఉన్నాయని, సింగరాయకోండలో బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు రద్దు చేశారని, వాటిని తిరిగి పునరుద్దరిస్తు తోలిసంతకం చేశానని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. పర్చూరు నియోజకవర్గం, నాగులుపాలెం గురుకుల పాఠశాలలో పైలెట్ ప్రాజెక్టు కింద రూ. 15 లక్షలతో సోలార్ ప్రాజెక్టును హట్ వాటర్ కోసం మంజూరు చేశామని, అక్కడే పాఠశాలలకు అందించే పళ్ళు, కూరగాయలు, గుడ్లు నిల్వకు కోల్డ్ స్టోరేజి రూమును రూ. 9 లక్షలతో పైలెట్ ప్రాజెక్టు కింద ఇస్తున్నామన్నారు.


గతప్రభుత్వంలో ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం కింద నోడల్ ఏజెన్సీగా సోషల్ వెల్పేర్ డిపార్టుమెంట్ ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి రూ. 2505.56 కోట్లు, ఎస్సీ విద్యార్ధులకు రూ. 131.82 కోట్లు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. వాటిని ఇప్పడు మేము చెల్లించాల్సి వస్తోందని.. లేకపోతే వారికి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్ధితి ఉందన్నారు. ఎన్టీఆర్ విద్యా ఉన్నతి పధకంకు రూ. 199 కోట్లు బకాయిలు... అంబేద్కర్ విదేశీ విద్య పధకం కింద 5.69 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని మంత్రి పేర్కొన్నారు. మంచి స్కూల్స్‌ను గత ప్రభుత్వం రద్దుచేసి రూ. 60.10 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టానికి సంబంధించి వారికి రావాల్సిన బకాయిలు ఆర్ధిక శాఖ నుండి 21.81 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు.


అన్ని పధకాలపై గత ప్రభుత్వంలో మొత్తం బకాయి 3573.22 కోట్లు రూపాయలుగా ఉందని, ఇప్పడు ఆ భారం మొత్తం తమ ప్రభుత్వంపై పడిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. గురుకుల పాఠశాలల్లో జీతభత్యాలు, కాస్మటిక్ చార్జీలు, నిర్వహణ చార్జీలు, ఆర్జిత శెలవులు, పారిశుద్ధ్య కార్మికుల బిల్లులు రూ. 243.34 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం పేదలను మభ్యపెట్టినందునే ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారని, వాలంటీర్లను తీసేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. పెన్షన్లు ఒకటో తేదీన రూ. వెయ్యి పెంచి ఏరియర్స్ కలిపి మొత్తం రూ. 7 వేలు ఇస్తామని చెప్పామన్నారు. కాగా డోలా బాల వీరాజనేయ స్వామి భాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్‌లు అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వారిని నా కుటుంబ సభ్యులుగా పరిగణిస్తా..

రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

మాజీ వైసీపీ ఎంపీకు హైకోర్టులో ఎదురుదెబ్బ

విచారణకు రావాలంటూ కేసీఆర్‌కు మరో లేఖ..

టీడీపీ, జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు?..

కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 26 , 2024 | 01:11 PM