Share News

Jagan: నేడు బెంగళూరు పర్యటనకు జగన్..

ABN , Publish Date - Jul 15 , 2024 | 01:57 PM

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మరోమారు బెంగళూరు పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజులపాటు ఆయన అక్కడే ఉంటారని సమాచారం. అయితే వరుస పర్యటనల మర్మమేమిటనే చర్చ కూడా జరుగుతోంది.

 Jagan: నేడు  బెంగళూరు పర్యటనకు జగన్..

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత (YCP Chief), మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Ex CM Jagan) సోమవారం మరోమారు బెంగళూరు పర్యటనకు (Banglore Tour) వెళ్లనున్నారు. వారం రోజులపాటు ఆయన అక్కడే ఉంటారని సమాచారం. అయితే వరుస పర్యటనల మర్మమేమిటనే చర్చ కూడా జరుగుతోంది. మొదట సోమవారం నుంచి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ (Praja Durbar) నిర్వహించాలని జగన్ ప్లాన్ చేసుకున్నారు. పార్టీ నాయకులు, ప్రజలను కలిసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. కానీ సడన్‌గా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని జగన్ బెంగళూరు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.


మరోవైపు ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. సోమవారం బెంగళూరుకు వెళుతున్న జగన్ వారం రోజులపాటు అక్కడే ఉంటారని సమాచారం. వచ్చేవారం నాటికి ఆయన ఏపీకి వచ్చి అసెంబ్లీకి వెళతారా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.


ఇప్పటికే సీఎం చంద్రబాబు (CM Chandrababu) మూడు శ్వేతపత్రాలు (White Papers) రిలీజ్ చేశారు. 1. అమరావతికి సంబంధించి, 2. పోలవరం, 3. కరెంట్‌కు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేశారు.ఈరోజు సహజవనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై చంద్రబాబు మరో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎంకు సమర్పించేందుకు గనులశాఖ నివేదికను తయారు చేసింది. అందులో అనేక కీలక అంశాలను పొందుపరిచింది. జగన్ పాలనలో గనుల తవ్వకాలు, అమ్మకాల్లో అంతులేని దోపిడి జరిగింది. ఖనిజాల తవ్వకాలకు ఇచ్చే పర్మిట్లు, రవాణా, ఇతర వ్యవహారాల్లో అంతుచిక్కని అనేకానేక అక్రమాలు ఉన్నాయి. కేవలం ఐదారు అంశాలను ప్రాథమికంగా పరిశీలన చేస్తేనే గత ఐదేళ్ల కాలంలో రూ. 19వేల కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. ఇంకా లెక్క తెలాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈరోజు విడుదల చేయనున్న శ్వేతపత్రంలో జగన్‌కు సంబంధించిన అవినీతి చిట్టా మొత్తం బయటకు వస్తుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యాదాద్రి సామూహిక గిరి ప్రదర్శన

నేటి నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులు..

బీమా పేరుతో రైతన్నలకు జగన్‌ దగా..

పూరీ జగన్నాథ్ ఆలయంలో టెన్షన్..

దొంగలెక్కలు రాయడంలో ఆయన దిట్ట..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 15 , 2024 | 01:59 PM