Share News

Vijayawada: సత్యనారాయణపురంలో అర్ధరాత్రి వివాదం

ABN , Publish Date - Feb 20 , 2024 | 07:11 AM

విజయవాడ: సత్యనారాయణపురంలో అర్ధరాత్రి వివాదం జరిగింది. బీఆర్‌టీఎస్ జంక్షన్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టేందుకు వీహెచ్‌పీ, బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైల్వే స్థలంలో విగ్రహం పెట్టడానికి అనుమతి లేదన్నారు.

Vijayawada: సత్యనారాయణపురంలో అర్ధరాత్రి వివాదం

విజయవాడ: సత్యనారాయణపురంలో అర్ధరాత్రి వివాదం జరిగింది. బీఆర్‌టీఎస్ జంక్షన్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టేందుకు వీహెచ్‌పీ, బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైల్వే స్థలంలో విగ్రహం పెట్టడానికి అనుమతి లేదన్నారు. అయితే ఇది కార్పొరేషన్ స్థలమేనని వీహెచ్‌పీ నేతలు వాదించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకున్నా వైసీపీ నాయకులే విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారని వీహెచ్‌పీ, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, వీహెచ్‌పీ, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాం జరిగింది. దీంతో పోలీసులు అదనపు బలగాలతో బీజేపీ నాయకులను అక్కడ నుంచి బలవంతంగా పంపేవేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

The video is not available or it's processing - Please check back later.

Updated Date - Feb 20 , 2024 | 07:11 AM