Share News

Anagani Satyaprasad: విశాఖలో జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి అనగాని

ABN , Publish Date - Aug 15 , 2024 | 10:33 AM

Andhrapradesh: దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విశాఖ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి అనగాని ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Anagani Satyaprasad:  విశాఖలో జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి అనగాని
Minister Anagani Satyaprasad

విశాఖపట్నం, ఆగస్టు 15: దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad) అన్నారు. విశాఖ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day 2024) వేడుకల్లో మంత్రి అనగాని ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాలు ఫలితంగా స్వతంత్రం సాధించామన్నారు. భగత్ సింగ్ , సుభాష్ చంద్రబోస్ నినాదాలు ఆనాడు ప్రజలను కదిలించాయని తెలిపారు. ఏపీ నుంచి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, గౌతు లచ్చన్న వంటి ఎంతో మంది త్యాగ మూర్తులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు.

Chandrababu: రాజధాని లేని స్థితి నుంచి రాష్ట్ర పాలన ప్రారంభించాం..


అల్లూరి సీతారామరాజు, గంటం దొర వంటి వారు బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడారన్నారు. 2014లో హుద్ హుద్ తుఫాన్ వలన అతలాకుతలమైన విశాఖను చంద్రబాబు బస్సులోనే ఉండి పునర్ నిర్మించారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. విశాఖను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి తోడ్పడుతున్న అందరికీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు.

Chandrababu: ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా జెండా ఎగురవేసిన చంద్రబాబు


కాగా.. పోలీస్ బ్యారెక్స్ పెరేడ్ గ్రౌండ్లో 78వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘనంగా నిర్వహించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకలకు ఎంపీ శ్రీభారత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ చిరంజీవి, జిల్లా కలెక్టర్ హరింద్ర ప్రసాద్, ఉన్నత అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

Treadmill: ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేసేటప్పుడు ఈ మోడ్ ఆన్ చేసి చూడండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!

YS Sharmila: పంద్రాగస్టు రోజున ప్రధాని మోదీపై షర్మిల విసుర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 15 , 2024 | 10:42 AM