Share News

Vijayawada: పవన్‌ను చంపేస్తా.. గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కిన నిందితుడు..

ABN , Publish Date - Dec 09 , 2024 | 08:48 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన అగంతకుడిని విజయవాడ కృష్ణలంక పోలీసులు గుర్తించారు. నిందితుడు లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్‌లో ఉంటున్న మల్లిఖార్జున్‌గా పోలీసులు నిర్ధారించారు.

Vijayawada: పవన్‌ను చంపేస్తా.. గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కిన నిందితుడు..
AP Deputy CM Pawan Kalyan

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన అగంతకుడిని విజయవాడ కృష్ణలంక పోలీసులు గుర్తించారు. నిందితుడు లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్‌లో ఉంటున్న మల్లికార్జున్‌గా పోలీసులు నిర్ధారించారు. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులు సెల్ ఫోన్ ట్రాక్ చేయగా లబ్బిపేట నుంచి కాల్స్, మెసేజ్‌లు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే పోలీసులు లబ్బిపేటకి వెళ్లే సరికే నిందితుడు మల్లికార్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో హోంమంత్రి అనితకు సైతం ఇదే నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.


కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చంపేస్తానంటూ ఆయన పేషీకి మల్లికార్జున్ అనే వ్యక్తి ఇవాళ (సోమవారం) ఫోన్ చేశాడు. పవన్‌ను చంపేస్తానంటూ అతను బెదిరింపులకు దిగాడు. ఉప ముఖ్యమంత్రిని అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ పలు మెసేజ్‌లు పంపించాడు. అప్రమత్తమైన సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎంకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఆయన.. బెదిరింపులకు సంబంధించిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన గురించి హోంమంత్రి వంగలపూడి అనితకు తెలియగా.. ఆమె వెంటనే డీజీపీకి ఫోన్ చేశారు. నిందితుడి ఫోన్ నంబర్ సహా పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.


అయితే అగంతకుడు రెండు సార్లు ఫోన్ చేశాడని, పలు మెసేజ్‌లు పంపించాడని హోంమంత్రి అనితకు డీజీపీ తెలిపారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని అనిత ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పెషల్ టీమ్‌లు రంగంలోకి దిగాయి. నిందితుడి కాల్స్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఫోన్ సిగ్నల్స్ విజయవాడ లబ్బిపేట నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఆ నంబర్ మల్లికార్జున్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా, మల్లికార్జున్ ఎవరు, ఎందుకు బెదిరింపులకు దిగాడు, అతని వెనక ఎవరైనా ఉన్నారా? ఎవరు చేప్తే చేశాడు వంటి విషయాలు విచారణలో తెలియనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Nadendla: రైతులు కంగారు పడి వారి చేతిలో మోసపోవద్దు: మంత్రి నాదెండ్ల..

YSRCP: వైసీపీ నేతలు ఇక మారరా.. అసత్య ప్రచారాల్లో అగ్రస్థానం

Updated Date - Dec 09 , 2024 | 09:05 PM