‘విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు’
ABN , Publish Date - Oct 24 , 2024 | 12:49 AM
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అసోసియేట్ డీన్ జయలక్ష్మి అన్నారు.
మహానంది, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అసోసియేట్ డీన్ జయలక్ష్మి అన్నారు. మహానంది ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాలలో దీక్షారంభ్ కార్యక్రమాన్ని అసోసియేట్ డీన్ జయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం వ్యవసాయ కళాశాలలో మెదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగత కార్యక్రమం(దీక్షారంభ్)లో ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వ విద్యాలయం గౌరవ ఉపకులపతి డాక్టర్ ఆర్. శారదా జయలక్ష్మిదేవి మెదటి సంవత్సరం విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు విద్యార్థులకు వ్యవసాయ విద్య, ఉపాధి గురించి తెలియజేశారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ వి. జయలక్ష్మి విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. కళాశాలలో ఉన్న సౌకర్యాల గురించి తెలిపారు. శాస్త్రవేత్తలు ఎల్. విజయభాస్కర్, స్వరాజ్యలక్ష్మి, సుబ్బరామిరెడ్డి, నారాయణరావు, శ్రీనివాసరెడ్డి, మాధవి, మల్లేశః్వరరెడ్డిల, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.