‘పంట న మోదు తప్పనిసరి’ | crop registration is mandatory
Share News

‘పంట న మోదు తప్పనిసరి’

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:21 AM

ప్రతి రైతు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో పంట నమోదు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయ,ఏవో విష్ణువర్దన్‌రెడ్డి సూచించారు.

‘పంట న మోదు తప్పనిసరి’
నల్లకాలువ గ్రామంలో ఈకేవైసీని పరిశీలిస్తున్న ఏడీఏ

ఆత్మకూరు రూరల్‌, సెప్టెంబరు 11: ప్రతి రైతు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో పంట నమోదు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయ,ఏవో విష్ణువర్దన్‌రెడ్డి సూచించారు. మండలంలోని నల్లకాలువ, కరివేన గ్రామాల్లో ఈ పంట నమోదు,ఈ కేవైసీ కార్యక్రమాలను బుధవారం పర్యవేక్షించారు. వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

బండిఆత్మకూరు: రైతులు తము సాగు చేసిన పంటలను నమోదు చేయించాలని ఏవో స్వాతి సూచించారు. మండలంలోని ఈర్నపాడు గ్రామంలో బుధవారం రైతుల సహాకార కేంద్రంలో పంట, ఈకేవైసీ నమోదును ఆమె పరిశీలించారు. ఏవో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీలోగా ప్రతి రైతు పంట, ఈకేవైసీ ఆయా గ్రామాల్లోని వీఏఏల వద్ద నమోదు చేయించుకోవాలని తెలిపారు. నమోదు చేసుకుంటేనే రైతు పథకాలకు అర్హులవుతారని చెప్పారు. వీఏఏ సామ్రాట్‌ పాల్గొన్నారు.

పాములపాడు: మండలంలోని రైతులు ఈ నెల 15లోపు పంట నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ఫణీశ్వరరెడ్డి తెలిపారు. పాములపాడులోని వ్యవసాయశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ రైతులు తాము సాగుచేసిన పంటను రైతుసేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 19 నుంచి 24 వరకు రైతు సేవా కేంద్రాలలో పంట నమోదు జాబితాను ప్రదర్శించి, గ్రామసభ నిర్వహించి అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. ఈ నెల 30న తుది జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

‘వందశాతం పూర్తి’

వెలుగోడు: వెలుగోడు మండలంలో వందశాతం పంటనమోదు కార్యక్రమం నమోదు అయినట్లు ఏవో పవన్‌ కుమార్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండలంలో సాధారణ సాగు విస్తీర్ణం 11,860 ఎకరాల్లో పంట నమోదు చేశామని చెప్పారు. పంట నమోదుకు సంభందించి రైతులు ఈకేవైసీ చేయించుకోవాలని తెలిపారు. ఈ నెల 19 నుంచి 24 వరకు రైతు సేవా కేంద్రాల్లో ఈ పంట నమోదు జాబితాను ప్రదర్శన చేసి, గ్రామసభ నిర్వహించి అభ్యంతరాలు స్వీకరిస్తమని చెప్పారు. 30న తుది జాబిత ప్రచురించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Sep 12 , 2024 | 12:21 AM