Share News

ఘనంగా వన మహోత్సవం

ABN , Publish Date - Aug 31 , 2024 | 01:15 AM

మహానంది మండలం గాజులపల్లి ఆర్‌ఎ్‌సలో అటవీశాఖ శుక్రవారం ఘనంగా వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించింది.

ఘనంగా వన మహోత్సవం
ఆత్మకూరులోని డిగ్రీ కళాశాలలో మొక్కను నాటుతున్న అటవీ అధికారులు

మహానంది, ఆగస్టు 30: మహానంది మండలం గాజులపల్లి ఆర్‌ఎ్‌సలో అటవీశాఖ శుక్రవారం ఘనంగా వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించింది. చలమ రేంజ్‌ ఆఫీసర్‌ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో గ్రామంలోని రామాలయం ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. అంతకముందు వనమహోత్సవంలో భాగంగా గ్రామంలోని ప్రజలతో కలసి అధికారులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అస్లాం బాషా, ఈవోఆర్డీ శివనాగజ్యోతి, ఉపాధి హామీ పథకం ఏపీఎం మనోహర్‌, పంచాయతీ కార్యదర్శి కలువ భాస్కర్‌, ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కిషోర్‌, ఖాశీం నాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఆత్మకూరు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వి.సాయిబాబా అన్నారు. వన మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పట్టణ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆత్మకూరు రేంజ్‌ అధికారి పట్టాభి, కళాశాల ప్రిన్సిపల్‌ జిష్ణు నాగవిజయ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ పద్మావతిబాయి, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.

వెలుగోడు: ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి పరిరక్షించాలని అటవీశాఖ అధికారి ఎంఏ ఖాన్‌ అన్నారు. కేజీబీవీలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. మొక్కలు నాటి నీరు పోశారు. కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీనిజ పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 01:15 AM