YSRCP: జగన్‌ను బయట ఉంచి తప్పు చేస్తున్నారు.. వైసీపీ కార్యకర్త
ABN , Publish Date - Nov 24 , 2024 | 07:38 AM
వైఎస్ జగన్ వీరాభిమాని, ఆ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని బండ బూతులు తిడుతూ.. తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయనను నమ్మి మోసపోయానని, వ్యాపారంలో నష్టపోయి రోడ్డు పాలయ్యానని, రాష్ట్ర ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. జగన్‌ను బయట ఉంచి తప్పు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ కార్యకర్త అన్నారు.
కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSRCP Chief), మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (Ex CM Jagan) ఆ పార్టీ కార్యకర్త (YSRCP Activist) తీవ్రస్థాయిలో ఫైర్ (Fire) అయ్యారు. ‘నిన్ను నమ్మి మోసపోయాం’ అంటూ.. జగన్ వీరాభిమాని, వైసీపీ కార్యకర్త పచ్చి బూతులు తిట్టారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సజ్జల రామకృష్ణారెడ్డి మోసకారి అని, వేల కోట్లు సంపాదించుకొని జగన్‌ను నిండా ముంచారని వైసీపీ కార్యకర్త విమర్శించారు. రాష్ట్రానికి బాగు చేస్తాడని 151 సీట్లు ఇస్తే జగన్ జనాన్ని నిలువునా మోసం చేశారన్నారు. జగన్ మోసాల వల్ల ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని.. జగన్‌ను బయట ఉంచి తప్పు చేస్తున్నారని.. జగన్‌ను జీవితాంతం జైలులోనే ఉంచాలన్నారు. జగన్‌ను నమ్ముకొని వ్యాపారంలో నష్టపోయి రోడ్డు పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన ఫోటో కూడా తన ఛాతిపై పచ్చ బొట్టు వేయించుకున్నానని చూపించారు. రేపే జగన్ బొమ్మ ఉన్న పచ్చబొట్టు తీసేస్తానని చెప్పారు. కార్యకర్తల బాధను జగన్‌కు తెలియజేయమని గతంలో ఎమ్మెల్యే హఫీస్ ఖాన్‌కు చెప్పానని.. ఆయన పట్టించుకోలేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు చేతికి జగన్ జుత్తు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News