Amarnath: చంద్రబాబు బెయిల్‌పై ఉన్న దొంగ.. ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు
ABN , Publish Date - Jan 16 , 2024 | 04:14 PM
Andhrapradesh: 17 ఏపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వేరువేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రొసీజర్ ఫాలో కాలేదని క్వాష్ చేయమని మాత్రమే కోరారన్నారు. ఈరోజు తీర్పు వల్ల నిజాయితీపరుడని, దొంగతనం చేయలేదని ఎక్కడా న్యాయస్థానం చెప్పలేదన్నారు.
విశాఖపట్నం, జనవరి 16: 17 ఏపై సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయమూర్తులు వేరు వేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రొసీజర్ ఫాలో కాలేదని క్వాష్ చేయమని మాత్రమే కోరారన్నారు. ఈరోజు తీర్పు వల్ల చంద్రబాబు నిజాయితీపరుడని, దొంగతనం చేయలేదని ఎక్కడా న్యాయస్థానం చెప్పలేదన్నారు.
చంద్రబాబు తరపున న్యాయవాదులు గాని, వ్యక్తులు గాని తాము తప్పు చేయలేదని ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడడం లేదన్నారు. చంద్రబాబు న్యాయస్థానం ముందు నిలబడి తప్పు చేయలేదని చెప్పవచ్చు కదా అని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బెయిల్ మీద ఉన్న దొంగ అని విరుచుకుపడ్డారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు శిక్ష పడక తప్పదన్నారు.
అయితే మాకేంటి...
వైఎస్ షర్మిల రెడ్డికి ఏపీసీసీ చీఫ్‌గా నియమించడంపై మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే లేని కాంగ్రెస్ పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే తమకేంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లేని పార్టీ కోసం మాట్లాడుకోవడం వృధా అని వ్యాఖ్యలు చేశారు. షర్మిల ప్రభావం జీరో పర్సెంట్ ఉంటుందని మంత్రి అమర్నాత్ పేర్కొన్నారు.