AP Politics: పోటీకి దూరంగా నాగబాబు.. కారణమిదే..?
ABN , Publish Date - Mar 14 , 2024 | 04:49 PM
జనసేన (Janasena) నేత, సినీ నటుడు కొణిదెల నాగబాబు (Nagababu) రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనట్లే కనబడుతోంది. కొద్ది రోజుల క్రితం తాను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి కూడా అన్ని మార్గాలను సుగమం చేసుకున్నారు. కూటమిలో ఉన్న జనసేన - తెలుగుదేశం పార్టీ(టీడీపీ) - బీజేపీ నేతలను కూడా కలిసి తనకు మద్దతివ్వాలని కూడా నాగబాబు కోరారు. అయితే అనూహ్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.
అమరావతి: జనసేన (Janasena) నేత, సినీ నటుడు కొణిదెల నాగబాబు (Nagababu) రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనట్లే కనబడుతోంది. కొద్ది రోజులక్రితం అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి కూడా అన్ని మార్గాలను సుగమం చేసుకున్నారు. కూటమిలో ఉన్న జనసేన-టీడీపీ నేతలను కూడా కలిసి తనకు మద్దతివ్వాలని కూడా నాగబాబు కోరారు. అయితే టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏలో చేరిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. పొత్తుతో అనూహ్యంగా నాగబాబు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుల వల్ల ఈ సీటును కమలం పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పొత్తుల మధ్యవర్తిత్వం వల్ల తనకు త్యాగాలు తప్పలేదని అన్నారు. బీజేపీ సీట్లు కోరుకోవడంతో తాను కొన్ని సీట్లు వదిలేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. తన సొంత అన్న నాగబాబు పార్లమెంట్ సీటు కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. అంటే.. నాగబాబు పోటీ చేయట్లేదని స్వయంగా పవన్ ప్రకటించేశారన్న మాట.
మాటిచ్చి..?
అన్న నాగబాబుకు మాటిచ్చి కూడా పొత్తులో బీజేపీ (BJP)కి సీటు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. అయినా జనసేన గెలుపు కోసం పని చేస్తానని నాగబాబు చెప్పారని.. తనను అర్ధం చేసుకున్న అన్నకు పవన్ సభావేదికగా కృతజ్ఞతలు తెలిపారు. పొత్తులు అనుకున్నాక చాలా సమస్యలు, త్యాగాలు ఉంటాయని వివరించారు. తాను మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఎంతో నష్టపోవాల్సి వస్తోందని చెప్పారు. పెద్ద మనసుతో వెళ్తే.. తానే సీట్లు వదులు కోవాల్సి వచ్చిందని తన మనసులోని మాటను వెలిబుచ్చారు.
అంతా పొత్తులోనే..!
అయినా ప్రజలు, రాష్ట్రం కోసం నిలబ్డడానని చెప్పారు. విధుర నీతి ప్రకారం... ఆంధ్ర రాష్ట్రం క్షేమం కోసం తన అన్నతో సహా తాను కూడా త్యాగాలు చేయాల్సి వచ్చిందని అన్నారు. పొత్తులో భాగంగా సీట్లు రాని వారు తనను తిట్టినా భరించక తప్పదని అన్నారు. కానీ స్థాయిని మరిచినా, పొత్తు ధర్మాన్ని నాశనం చేసినా.. ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
Pawan Kalyan: నేను రాజకీయాల్లోకి అందుకే వచ్చా.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌పై వైసీపీ నుంచి పోటీ చేసేదెవరు..?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి