Nara Lokesh: పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?!
ABN , Publish Date - Apr 08 , 2024 | 02:02 PM
సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాల దగ్ధంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?! అని ప్రశ్నించారు. నేర పరిశోధనపై దృష్టి సారించాల్సిన ఏపీసీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయన్నారు
అమరావతి: సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాల దగ్ధంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ట్వీట్ చేశారు. పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?! అని ప్రశ్నించారు. నేర పరిశోధనపై దృష్టి సారించాల్సిన ఏపీసీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయన్నారు. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్‌లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జేపీఎస్ (జగన్ పోలీస్ సర్వీస్)గా రూపాంతరం చెందారని నారా లోకేష్ అన్నారు. మా కుటుంబంపై బురద జల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగిందన్నారు.
Viveka Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం
నిబంధనలకు విరుద్దంగా సీఐడీ డిఐజి రఘురామిరెడ్డి నేతృత్వాన అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిపోవడంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ పత్రాలను తగులబెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలవాల్సిన కొందరు ఐపీఎస్ లు ఇంతటి బరితెగింపునకు పాల్పడటం దేశచరిత్రలో ఇదే ప్రథమమని అన్నారు. పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా? అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు.. చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు.
TDP: ఆ అధికారి ఆదేశాల మేరకే హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధం.. టీడీపీ నేతల మండిపాటు
మరిన్ని ఏపీ వార్తల కోసం...