Earthquake: ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు.. ఎక్కడంటే?
ABN , Publish Date - Dec 21 , 2024 | 11:08 AM
ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. ఇవాళ(శనివారం) దర్శి నియోజకవర్గంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరు, కురిచేడు మండలాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.
ప్రకాశం : ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. ఇవాళ(శనివారం) దర్శి నియోజకవర్గంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరు, కురిచేడు మండలాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది. భయంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.
కాగా.. డిసెంబర్ 4వ తేదీన ఉమ్మడి కృష్ణాజిల్లాలో కొద్దిసేపు భూప్రకంపనలు సంభవించాయి. ఉదయం 7.20 గంటల సమయంలో కొద్ది సెకన్ల పాటు ఈ పరిస్థితి తలెత్తింది. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూమి కంపించడంతో దాన్ని భూకంప కేంద్రంగా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తున్నారు. భూమి అడుగు భాగం నుంచి 200-300 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలను గుర్తించారు. ఇది రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదైంది.
కొద్దిరోజుల క్రితం..
గతంలో .. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశాన్ని ఐదు జోన్లుగా విభజించింది. రెండు తెలుగు రాష్ట్రాలు జోన్-2లో ఉన్నాయి. ములుగులో భూమి కంపించిన ప్రభావం ఉమ్మడి కృష్ణాజిల్లాపై పడింది. నందిగామ, జగ్గయ్యపేట, మైలవరంతో పాటు విజయవాడ నగరం, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, నందిగామ, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో ప్రకంపనలు వచ్చాయి. తిరువూరు మండలం రాజుపేటలో ఈ ప్రకంపనలకు ఇంటి గోడకు బీటలు వచ్చాయి. సీసీ కెమెరాల్లో భూప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. కొన్నిచోట్ల ప్రజలు భయంతో పరుగులు తీశారు. గంపలగూడెంలో గోడలపై ఉన్న పాత్రలు కిందపడ్డాయి.హనుమాన్ జంక్షన్‌లోని ఓ వీధిలో భూమి ఊగినట్టు సీసీ కెమెరాల్లో స్పష్టంగా తెలిసింది.
అంతా ప్రమాదం కాదు : శాస్త్రవేత్తలు
అయితే గతంలో ఈ ప్రకంపనలతో జిల్లాలోని తీరప్రాంతంలో ప్రజలు భయాందోళన చెందారు. అయితే, కాసేపటికే పరిస్థితి మామూలుగా మారడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రకంపనలకు భయపడాల్సిన అవసరం లేదని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతుండగా, భూకంపాలు వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయని మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. జోన్-2లో ఉన్న ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేదని భౌతిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని వెల్లడిస్తున్నారు. జోన్-2లో భూమి ఎప్పుడూ రిక్టర్ స్కేల్‌పై 6-6.05 దాటి కంపించదని వారు పేర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu : ధాన్యం సేకరణలో తప్పులు జరగొద్దు
YS Sharmila : వారే కొట్టుకుని.. రాహుల్‌ను అంటున్నారు
AP High Court : మధ్యవర్తిత్వంపై హైకోర్టులో ముగిసిన శిక్షణ
Read Latest AP News and Telugu News