Sullurpeta : పులికాట్‌లో విదేశీ విహంగాల సందడి
ABN , Publish Date - Dec 25 , 2024 | 06:08 AM
తుఫాను, వానలతో కళకళలాడుతున్న పులికాట్ సరస్సులో విదేశీ వలస పక్షుల సందడి పెరిగింది. ఒకవైపు రొయ్యల వేటలో మత్స్యకారుల పడవలు తిరుగుతూ ఉంటే..
ABN AndhraJyothy : తుఫాను, వానలతో కళకళలాడుతున్న పులికాట్ సరస్సులో విదేశీ వలస పక్షుల సందడి పెరిగింది. ఒకవైపు రొయ్యల వేటలో మత్స్యకారుల పడవలు తిరుగుతూ ఉంటే, మరోవైపు ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్టార్క్స్.. గుంపులు గుంపులుగా ఎగిరొచ్చి సరస్సుకు కొత్త అందాన్ని తెచ్చాయి. ఇప్పటికే 50 వేల ఫ్లెమింగోలు పులికాట్‌కు చేరుకున్నట్టు అంచనా. ఇవిగాక నేలపట్టు నుంచి పెలికాన్‌లూ, వెదురుపట్టు నుంచి పెయింటెడ్ స్టార్క్స్ కూడా వేలాదిగా పులికాట్‌లో చేపలవేట సాగిస్తున్నాయి. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్లే రోడ్డుకు అటూ ఇటూ.. అటకానితిప్ప, వేనాడు దారి, పేర్నాడు రోడ్డు, శ్రీహరికోటకు ఉత్తరం దిక్కున నవాబ్‌పేట ప్రాంతం, పులికాట్ ముఖద్వారాల సమీపంలో వేల సంఖ్యలో వలస పక్షులు సందడి చేస్తున్నాయి.
-సూళ్లూరుపేట