చంద్రబాబు సభ ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:28 AM
శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో సోమవారం నిర్వహించనున్న ‘రా.. కదలి రా’ సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులతోపాటు సుమారు లక్షమంది ప్రజలు సభకు తరలిరానున్నారు.

అరసవల్లి, ఫిబ్రవరి 24: శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో సోమవారం నిర్వహించనున్న ‘రా.. కదలి రా’ సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులతోపాటు సుమారు లక్షమంది ప్రజలు సభకు తరలిరానున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సభాస్థలి, వేదిక, హెలీప్యాడ్ నిర్మాణం తదితర ఏర్పాట్లను మాజీమంత్రి బండారు సత్యనారాయణ, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే, శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు గణబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్, రాష్ట్ర తెలుకల సాధికార సమితి సభ్యుడు కొమ్మనాపల్లి వెంకటరామరాజు, మీడియా కో-ఆర్డినేటర్ ఎస్వీ రమణ మాదిగ, జల్లు రాజీవ్, ఐటీడీపీ అధ్యక్షుడు ప్రధాన విజయరాం, విభూది సూరిబాబు, గుత్తు చిన్నారావు, బుక్కా యుగంధర్‌పాల్గొన్నారు.