AP NEWS: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. మహిళను హత్య చేసి ఆపై...
ABN , Publish Date - Oct 31 , 2024 | 09:43 PM
జిల్లాలోని కడియం మండలం బుర్రిలంకలో దారుణ ఘటన జరిగింది. మహిళపై అత్యాచారం చేసి నలుగురు యువకులు హత్య చేశారు. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన ఓ మహిళను ఈనెల 15న నిందితులు హత్య చేశారు.
తూర్పుగోదావరి: జిల్లాలోని కడియం మండలం బుర్రిలంకలో దారుణ ఘటన జరిగింది. మహిళపై అత్యాచారం చేసి నలుగురు యువకులు హత్య చేశారు. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన ఓ మహిళను ఈనెల 15న నిందితులు హత్య చేశారు. ఈనెల 17న నిర్మానుష్య ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బుర్రిలంక గ్రామానికి చెందిన దేవర యేసు, వెలుబుడి ప్రవీణ్, లోకిన జయ ప్రసాద్, దాసరి సురేష్‌లు మహిళను అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. మృతదేహాన్ని కాలువలోకి నిందితులు విసిరేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులపైనా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు.
స్వధార్ హోమ్ నుంచి మహిళల పరారీ
విశాఖపట్నం: పెందుర్తిలోని స్వధార్ హోమ్ నుంచి అరుగురు మహిళలు పరారీ అయ్యారు. వార్డెన్ సుధా కళ్లల్లో కారం కొట్టి కత్తితో బెదిరించి ఆరుగురు పరారయ్యారు. ఆరుగురిలో ఐదుగురు ఐటీపీ కేసుకు సంబంధించిన వారు కాగా, ఒకరు సాధారణ మహిళగా గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో వార్డెన్ సుధా వంట చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు చేతులు వెనక్కి మడిచి పట్టుకుంటే ఒకరు కళ్లల్లో కారం కొట్టి హోం తాళాలు లాక్కొని తాళాలు ఓపెన్ చేసి మహిళలు పారిపోయారు. ఈనెల 22వ తేదీన ఐటీపీ కేసులో వచ్చిన బంగ్లాదేశ్ అమ్మాయి పారిపోయిన వారం రోజులు తర్వాత మళ్లీ ఆరుగురు మహిళలు సీసీ కెమెరాలు వైర్లు కట్ చేసి పరారీ అయ్యారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. హోం నిర్వాహకులు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.