Share News

Kollu Ravindra: చెల్లెలి ఆస్తి దోచుకున్న దుర్మార్గుడు జగన్

ABN , Publish Date - Oct 28 , 2024 | 03:59 PM

Andhrapradesh: వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ మాఫియా జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నాణ్యతలేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారన్నారు. మద్యం తయారీ కంపెనీ నుంచి అమ్మకాలు వరకు అవినీతి చేసి అడ్డంగా దోచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన లిక్కర్ మాఫియాపై సీఐడీతో విచారణ జరిపిస్తున్నామన్నారు.

Kollu Ravindra: చెల్లెలి ఆస్తి దోచుకున్న దుర్మార్గుడు జగన్
Minister Kollu Ravindra

అనకాపల్లి జిల్లా, అక్టోబర్ 28: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan), వైసీపీ హయాంలో లిక్కర్ మాఫియాపై మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబంలో చెల్లెలి ఆస్తి దోచుకున్న దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి సీఎంగా పనిచేయడం రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ మాఫియా జరిగిందని ఆరోపించారు. నాణ్యతలేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారన్నారు. మద్యం తయారీ కంపెనీ నుంచి అమ్మకాలు వరకు అవినీతి చేసి అడ్డంగా దోచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన లిక్కర్ మాఫియాపై సీఐడీతో విచారణ జరిపిస్తున్నామన్నారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధిలో అనకాపల్లి జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

PM Modi: ఫుట్‌బాల్ అంటే మాకూ ఇష్టమే: ప్రధాని మోదీ


మాజీ కోడిగుడ్డు మంత్రిపై చర్యలు తప్పవు..

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై మంత్రి విరుచుకుపడ్డారు. మాజీ కోడిగుడ్డు మంత్రి చేసిన అక్రమాలను వెలికితీసి, చర్యలు తీసుకుంటామని అన్నారు. సూపర్ సిక్స్ లో దశలవారీగా అన్ని పథకాలు అమలు చేస్తామని.. దీపావళికి గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూటమి నాయకులకు తగిన ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. వైసీపీ వాళ్ళు..రుషికొండకు గుండు కొట్టారని.. భూములు నొక్కేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి అత్యంత ఇష్టమైన జిల్లా.. ఉమ్మడి విశాఖ జిల్లా అని తెలిపారు.


అనకాపల్లి జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు సహా అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. రాబోయే 20 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉండేలా పరిపాలన ఉంటుందన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండే విధంగా ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తామన్నారు. అనకాపల్లిలో వంద పడకల ఎన్టీఆర్ వైద్యాలయాన్ని మల్టీ స్పెషాలిటీఆసుపత్రిగా తీర్చి దిద్దుతామని తెలిపారు. మత్స్యకారులు, బీసీ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

Death Threat: పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు


కాగా.. ఈరోజు ఉదయం రాష్ట్ర ఎక్సైజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అనకాపల్లి జిల్లాకు వచ్చారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో తొలిసారి అనకాపల్లి విచ్చేసిన మంత్రి రవీంద్రకు కూటమి నాయకులు భారీ స్వాగతం పలికారు. అనంతరం అనకాపల్లి టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి రవీంద్ర నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ , రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, కొణకాల రామకృష్ణ, కె ఎస్ఎన్ రాజు, పంచకర్ల రమేష్ బాబు , మాజీ మంత్రులు పప్పల చలపతిరావు, దాడి వీరభద్రరావు తదితరులు హాజరయ్యారు.

Updated Date - Oct 28 , 2024 | 04:00 PM