Share News

AP POLITICS: సీఎం జగన్‌పై జనసేన నేత నాగబాబు హాట్ కామెంట్స్

ABN , Publish Date - Feb 16 , 2024 | 06:33 PM

ఏపీలో రాక్షస పాలన పోయే విధంగా జనసేన - టీడీపీ కూటమి ముందుకు సాగుతాయని జనసేన నాయకుడు నాగేంద్రబాబు(Nagendra Babu) అన్నారు.

AP POLITICS: సీఎం జగన్‌పై  జనసేన నేత నాగబాబు హాట్ కామెంట్స్

అనకాపల్లి జిల్లా: ఏపీలో రాక్షస పాలన పోయే విధంగా జనసేన - టీడీపీ కూటమి ముందుకు సాగుతాయని జనసేన నాయకుడు నాగేంద్రబాబు (Nagendra Babu) అన్నారు. శుక్రవారం నాడు అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ పాలనలో దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు జనసేన- టీడీపీ నేతలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రెండు పార్టీల్లోని నేతలు జగన్ ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నించాలని అన్నారు. అనకాపల్లి జిల్లాలో సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నానని తెలిపారు. ఉత్తరాంధ్ర తిరిగే విధంగా ప్రస్తుతం ఇక్కడే ఉంటానని చెప్పారు. ఈస్ట్, వెస్ట్ జిల్లాలో తిరిగే విధంగా ప్రస్తుత స్థానానికి అచ్చుతాపురంలో ఉంటానని నాగేంద్రబాబు అన్నారు.

Updated Date - Feb 16 , 2024 | 07:33 PM