Share News

AP News: పెళ్లికానివాళ్లే వారి టార్గెట్...

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:01 PM

Andhrapradesh: దీన్ని ఆసరాగా తీసుకుని ఓ ముఠా పెద్ద ప్లానే వేసింది. మ్యాట్రామోని డాట్‌.కామ్‌‌లో పెళ్లి కాని వారే వీరి టార్గెట్. పెళ్లికాని వారి డీటెయిల్స్ తీసుకుని వారికి కళ్లబొల్లి మాటలు చెబుతూ సంబంధాలు కుదుర్చుకుని.. వివాహం అయిన తర్వాత తమకు ...

AP News: పెళ్లికానివాళ్లే వారి టార్గెట్...
Eluru District

ఏలూరు జిల్లా, అక్టోబర్ 7: సాధారణంగా వివాహం జరగాలంటే పెళ్లిళ్ల పేరయ్యను కలుస్తుంటారు పెద్దలు. లేకపోతే తెలిసిన వాళ్ల అమ్మాయినో, అబ్బాయినో లేదా బంధువుల సంబంధాలను కలుపుతుంటారు. ఈ మధ్యకాలంలో మ్యాట్రిమోని సైట్స్ రావడంతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం కూడా ఈజీగా మారిపోయింది. కులం, మతాలకు తగిన విధంగా వివిధ మ్యాట్రిమోనిలు వెలిశాయి. అబ్బాయి, అమ్మాయి డీటెల్స్ అందులో పెడితే చాలు సంబంధాలు కుప్పతెప్పలుగా వస్తుంటాయి.

Jani Master: రెగ్యులర్ బెయిల్‌ కోసం జానీమాస్టర్ పిటిషన్


దీన్ని ఆసరాగా తీసుకుని ఓ ముఠా పెద్ద ప్లానే వేసింది. మ్యాట్రామోని డాట్‌.కామ్‌‌లో పెళ్లి కాని వారే వీరి టార్గెట్. పెళ్లికాని వారి డీటెయిల్స్ తీసుకుని వారికి కళ్లబొల్లి మాటలు చెబుతూ సంబంధాలు కుదుర్చుకుని.. వివాహం అయిన తర్వాత తమకు అందినకాడికి దోచుకోవడమే వీరి పని.. ఇలా వీరి చేతిలో మోసపోయిన వారు ఎంతో మంది. అయితే చివరకు వీరి పాపం పండి పోలీసులకు చిక్కి కటకాలపాలయ్యారు.


మ్యాట్రిమోని డాట్.కామ్‌లో పెళ్ళి కాని వారిని ట్రాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఏలూరు జిల్లాలో (Eluru District) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్ళికొడుకు అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 లక్షల నగదు, బ్యాంకు పుస్తకాలు, కంప్యూటర్ సామగ్రీని భీమడోలు పోలిసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా బంగారు పేటకు చెందిన పాశం అనిల్ ప్రధాన నిందితుడని తెలిపారు.

Gold and Silver Rates: బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం..


ఇస్రోలో ఉద్యోగం అని ఆస్తులు, బంగ్లాలు ఉన్నాయని మోసం చేసి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చెప్పారు. ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేశామని.. అనిల్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ముఠాలోని మరికొంతమంది సభ్యులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. సమాజంలో రకరకాల మోసగాళ్లు పెరుగుతున్నారని.. ప్రజల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పెళ్లిళ్లు విషయంలో ఎటువంటి విచారణ జరపకుండా చేయవద్దని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Duvvada Srinivas: ప్రియురాలితో కలిసి తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్..

AP Police: దుర్గమ్మ చెంత విధులకు వచ్చిన పోలీసులు.. ఎంతటి ఘనకార్యం చేశారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 04:55 PM