Share News

Pawan Kalyan: పవన్ సభలో కత్తులతో కలకలం.. ఏకంగా పోలీసులపైనే..!?

ABN , Publish Date - Apr 22 , 2024 | 08:55 AM

పవన్ కల్యాణ్ భీమవరం సభలో చాకు కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు చాకుతో సభకు హాజరయ్యారు. సదరు వ్యక్తుల కదలికలను అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని వెదకగా జేబులో చాకులు లభ్యమయ్యాయి. భీమవరం బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు. టూ టౌన్ పోలీసులు అదుపులో ఇద్దరు యువకులు ఉన్నారు.

Pawan Kalyan: పవన్ సభలో కత్తులతో కలకలం.. ఏకంగా పోలీసులపైనే..!?

ఏలూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భీమవరం సభ సంచలనంగా మారింది. ఈ సభలో చాకు కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు చాకుతో సభకు హాజరయ్యారు. సదరు వ్యక్తుల కదలికలను అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిశితంగా పరిశీలించగా జేబులో చాకులు లభ్యమయ్యాయి. భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు. టూ టౌన్ పోలీసులు అదుపులో ఇద్దరు యువకులు ఉన్నారు. ఒక వ్యక్తి పోలీసులపైనే దాడి చేసేందుకు యత్నించినట్లు సమాచారం. ఇద్దరినీ వేరువేరుగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు జేబుల్లో చాకులు లభ్యమయ్యాయి. వీరిద్దరూ జేబు దొంగతనాలకు వచ్చారా..? లేదంటే దాడి చేసేందుకు వచ్చారా? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.

మన యుద్ధం రాక్షసులతో!


Pawan-Campaign-3.jpg

మాటల యుద్ధం!

కాగా... నిన్నటి సభలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. తన అన్న చిరంజీవి అజాత శత్రువని.. తన అన్నను సజ్జల ఏమైనా అంటే సహించబోమని హెచ్చరించారు. చిరంజీవి జోలికి గానీ.. శెట్టి బలిజ, కాపు సామాజిక వర్గం జోలికి తస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. నోరు జారడం.. తప్పు చేయడం వంటివి చేస్తే నడిరోడ్డుపై మోకాళ్ల మీద నడిపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. జగన్‌ను కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని పవన్ హెచ్చరించారు.

AP Election 2024: పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేత లేఖ

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 22 , 2024 | 09:15 AM