Share News

YS Sharmila: ఆ సమస్యలను పట్టించుకోరా అని మండిపాటు

ABN , Publish Date - Nov 15 , 2024 | 05:53 PM

ఈపీఎస్ 95 ఫించన్లదార్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చి రెండేళ్లు అయినా కేంద్రం చర్యలు చేపట్టక పోవడం ఏమిటని కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రులకు ఆమె లేఖ రాశారు.

YS Sharmila:   ఆ సమస్యలను పట్టించుకోరా అని మండిపాటు

విజయవాడ, నవంబర్15: ఈపీఎస్ 95 (EPS 95) పింఛనర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. 2022 నవంబర్‌లో EPS 95 పింఛనర్ల ప్రయోజనాలపై వారికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు. కానీ నాటి నుంచి అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వేలాది కుటుంబాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: గాడిద పాలు పేరుతో రూ. 100 కోట్ల మోసం..


ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మనుసుఖ్ మాండవీయలకు ఆమె విజ్జప్తి చేశారు. ఈ మేరకు వారికి శుక్రవారం ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి లేఖ రాశారు. పింఛన్‌దార్లకు పడుతున్న ఇబ్బందులకు కేంద్ర మంత్రుల దృష్టికి ఈ లేఖ ద్వారా ఆమె తీసుకు వెళ్లారు. ఈ ఆలస్యం @socialepfoపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.

Also Read: కాంగ్రెస్‌లోకి త్వరలో కారు పార్టీ ఎమ్మెల్యేలు


పింఛనర్లు తగినంత పింఛన్లు అందక తీవ్ర వేదనకు గురవుతున్నారని తెలిపారు. 1990లలో ప్రవేశపెట్టిన ఈ పథకం కాలక్రమేణా తగ్గిపోయిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. రిటైర్ అయిన వారి నుండి రుసుములు వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలు @socialepfo వద్ద నిల్వ ఉన్నాయని కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో ఆమె వివరించారు.

Also Read:: అన్మోలా మజాకా.. దీని మెనూ చూస్తే కళ్లు తేలేయాల్సిందే


అయితే ఒక ఏడాదిగా పింఛన్లు విడుదల చేయలేదని చెప్పారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. @socialepfo వృద్ధుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. మోదీ ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడంలో సమర్థత లేదా? అని ఆమె సందేహం వ్యక్తం చేశారు.

Also Read: నల్ల నువ్వుల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?


వీటిని ఆమలు చేయడంలో అసలు బాధ్యత ఎవరిదీ అంటూ కేంద్రాన్ని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ప్రశ్నించారు. దీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తక్షణం ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖను తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 15 , 2024 | 06:21 PM