Share News

Property Alert: భూమి కొనుగోలు చేస్తున్నారా.. ఈ డాక్యుమెంట్ల తనిఖీ తప్పనిసరి..

ABN , Publish Date - Sep 04 , 2024 | 06:56 PM

అనేక మంది మధ్యతరగతి ప్రజలు తమ ఖర్చులను ఏదో ఒక విధంగా తీర్చుకుంటారు. ఆ క్రమంలోనే కొంచెం డబ్బును ఇళ్లు లేదా భూమి కొనుగోలు కోసం ఆదా చేస్తుంటారు. అలా ప్లాన్ చేసినా కూడా పలువురు మాత్రం మోసపోతుంటారు. అయితే భూమిని కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Property Alert: భూమి కొనుగోలు చేస్తున్నారా.. ఈ డాక్యుమెంట్ల తనిఖీ తప్పనిసరి..
before buying land

ఇటివల కాలంలో ప్లాట్లు, భూమి(land) కొనుగోళ్ల(purchase) విషయంలో మోసాలు ఎక్కువయ్యాయి. ఒకరికి అమ్మిన భూమినే అనేక మందికి అమ్ముతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో భూమి కొనుగోలు విషయంలో ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, తనిఖీ చేయాల్సిన ముఖ్యమైన పత్రాలు ఏంటనే విషయాలు ఇప్పుడు చుద్దాం. మీరు కూడా ఏదైనా భూమిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా ఈ పత్రాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు మోసాల(cheating) బారి నుంచి తప్పించుకోవచ్చు.


ఈ పత్రాలు తప్పనిసరి

ముందుగా మదర్ డీడ్(mother dead) పత్రాన్ని తనిఖీ చేయాలి. ఇది భూమిని కొనుగోలు చేసే ముందు చూడవలసిన ముఖ్యమైన పత్రం. ఈ పత్రం ద్వారా మీరు భూమి యాజమాని అతనేనా లేదా మరొకరా అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది కాకుండా భూమి యాజమాని దానిని విక్రయిస్తే కొనుగోలుదారుకు బదిలీ చేసే సేల్ డీడ్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది. దానిని కూడా పరిశీలించాలి. భూమిని కొనుగోలు చేసే ముందు మీకు ఆ సమయంలో పాత రిజిస్ట్రీ మీకు చూపించే విధంగా శ్రద్ధ వహించండి. దీంతో మీరు కొనుగోలు చేస్తున్న భూమి ఎవరి పేరు మీద ఉందో స్పష్టమవుతుంది. చాలామంది వ్యక్తులు ఇతరుల పేరు మీద నమోదైన భూములను మీకు అమ్మే అవకాశం ఉంటుంది.


అధికారం

చాలా సందర్భాలలో భూమిని విక్రయించే వ్యక్తి పేరు మీద భూమి ఉండదు. దీని కోసం ఆ వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. ఇది కాకుండా ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్‌ను చూడటం కూడా ముఖ్యం. ఈ సర్టిఫికేట్ భూమికి సంబంధించిన అన్ని లావాదేవీల రికార్డును కలిగి ఉంటుంది. ఇది కాకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ను కూడా పరిశీలించండి. దీన్ని విక్రయించడానికి లేదా కొనడానికి ఎవరికి అభ్యంతరం లేదని దీని ద్వారా పరిగణించవచ్చు.


గుర్తింపు సర్టిఫికేట్

గుర్తింపు కార్డు కూడా నేడు అత్యంత ముఖ్యమైన పత్రమని చెప్పవచ్చు. భూమి యజమాని తెలియకపోతే దాని మొదట గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని తనిఖీ చేయాలి. ఇది కాకుండా భూమిని కొనుగోలు చేసే ముందు, మీరు యజమాని పూర్తి చిరునామాను కూడా పరిశీలించాలి. దీని కోసం మీరు అతని చిరునామా రుజువు, బిల్లు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను చూడవచ్చు. అందులో యజమానికి సంబంధించిన పత్రాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం.

హడావిడిగా

అందులో భూమిని స్వాధీనం చేసుకున్న తేదీ పేర్కొనబడుతుంది. చివరగా మీరు ఆ ఆస్తిపై పన్ను చెల్లించారా లేదా అని కూడా తనిఖీ చేయాలి. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు మీరు ఈ ముఖ్యమైన పత్రాలను తనిఖీ చేస్తే మోసం జరిగే ప్రమాదం దాదాపు ఉండదు. అందుకని హడావిడిగా కాకుండా కాసేపు వేచి ఉండి అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే భూమి లేదా ప్లాట్స్ వంటివి కొనుగోలు చేయాలి.


ఇవి కూడా చదవండి:

Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..


Money Savings: ఈ FDలలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని రోజులే ఛాన్స్.. 8% వరకు వడ్డీ రేటు


Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 04 , 2024 | 06:57 PM