Share News

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం.. ఐ ఫోన్ 15 ధర ఎంతంటే..?

ABN , Publish Date - Oct 20 , 2024 | 04:54 PM

పండగల వేళ.. వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ ఇస్తూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దీపాల పండగ.. దీపావళి. ఈ పండగ మరికొద్ది రోజుల్లో రానుంది. ఈ పండగను పురస్కరించుకుని సెల్ ఫోన్ల కంపెనీలు భారీగా ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. అయితే దీపావళి సేల్.. అక్టోబర్ 20వ తేదీ రాత్రి నుంచి ఫ్లిప్‌కార్డ్‌లో ప్రారంభమవుతుంది.

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం.. ఐ ఫోన్ 15 ధర ఎంతంటే..?

పండగల వేళ.. వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ ఇస్తూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దీపాల పండగ.. దీపావళి. ఈ పండగ మరికొద్ది రోజుల్లో రానుంది. ఈ పండగను పురస్కరించుకుని సెల్ ఫోన్ల కంపెనీలు భారీగా ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. అయితే దీపావళి సేల్.. అక్టోబర్ 20వ తేదీ రాత్రి నుంచి ఫ్లిప్‌కార్డ్‌లో ప్రారంభమవుతుంది. ఇక ఈ సేల్‌లో ఐఫోన్ 15 చాలా చౌకగా లభిస్తుంది. ఈ ఫోన్ రూ. 50 వేల కంటే తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయవచ్చు. అసలు అయితే ఈ సెల్ ఫోన్ ధర రూ. 66, 900. కానీ బ్యాంక్ ఆఫర్లతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలిపి.. ఈ సెల్ ఫోన్ రూ. 50 వేల కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు.

Also Read: HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు


చాలా తక్కువ ధరకు ఐఫోన్

Flipkart ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై బ్యాంకులు డిస్కౌంట్లు అందిస్తోంది. దీని ద్వారా ఐఫోన్ కొనుగోలు చేసి.. కొన్ని వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు. అలాగే మీ వద్ద పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే.. దానిని ఎక్స్ఛేంజ్ బోనస్ కింద విక్రయించవచ్చు. దీంతో ఈ పండగ వేళ.. ఫ్లిప్ కార్డు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా ఐ ఫోన్ 15ను కొనుగోలు చేయవచ్చు.

Also Read: Secunderabad Bandh: సికింద్రాబాద్‌లో బంద్.. ఆందోళనకారులపై కేసు నమోదు


ఈ ఐఫోన్‌లో ప్రత్యేకతలు..

ఈ ఫోన్‌లో A16 బయోనిక్ చిప్‌ సెట్ ఉంటుంది. ఇది చాలా వేగవంతంగా పని చేస్తుంది. గేమ్స్ ఆడుతున్నా, మల్టీ టాస్కింగ్ చేస్తున్నా లేకుంటే ఏదైనా యాప్ రన్ చేస్తున్నా ఈ ఐఫోన్ చాలా వేగంగా పని చేస్తుంది. ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే సైతం ఉంది. అలాగే ఐఫోన్ 15లో 48ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. దీంతో మీరు అతి తక్కువ వెలుతురులో కూడా చాలా మంచి ఫోటోలను తీయవచ్చు.

Also Read: ఉలవలు ఆహారంగా తీసుకోవడం వల్ల.. ఇన్ని ప్రయోజనాలున్నాయా..?


అలాగే ఈ ఫోన్‌లో మరిన్నీ ఫీచర్లు ఉన్నాయి. ల్యాండ్ స్కేప్‌తోపాటు గ్రూప్ ఫొటోలను సైతం తీసేందుకు ఈ ఫోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే విధంగా ఇందులో 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ 5Gని కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో చాలా వేగంగా ఇంటర్నెట్‌ని పొందవచ్చు. ఈ సెల్ ఫోన్‌లో బ్యాటరీ సైతం మన్నికగా చాలా కాలం వస్తుంది. MagSafe ఛార్జింగ్‌ సపోర్ట్‌గా ఉంటుంది. దీంతో ఈ ఐఫోన్ 15ను చాలా సులభంగా ఛార్జ్ చేయవచ్చు. ఎన్నీ ప్రత్యేకతలున్న ఈ ఐఫోన్‌ను దీపావళి వేళ.. ఫ్లిప్‌కార్డు సేల్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

For Business News And Telugu News..

Updated Date - Oct 20 , 2024 | 05:05 PM