Gold and Silver Prices: తగ్గిన బంగారం, వెండి ధరలకు బ్రేక్..ఎంత పెరిగాయంటే
ABN , Publish Date - Jun 29 , 2024 | 06:30 AM
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం(gold) ధరలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో నేడు (జూన్ 29న) ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 420 పెరిగి రూ.72,340కి చేరింది.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం(gold) ధరలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో నేడు (జూన్ 29న) ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 420 పెరిగి రూ.72,340కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 66,310కి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్(hyderabad), విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 71,720కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 66,160గా ఉంది. మరోవైపు వెండి(silver) ధర కూడా కిలోకు 100 రూపాయలు పెరిగింది. దీంతో దేశంలోని కీలక ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు, 24 క్యారెట్)
చెన్నై: రూ. 72,730
హైదరాబాద్: రూ. 71,720
విజయవాడ: రూ. 71,720
ఢిల్లీ: రూ. 72,340
ముంబై: రూ. 71,720
వడోదర: రూ. 72,220
కోల్‌కతా: రూ. 71,720
బెంగళూరు: రూ. 71,720
పూణే: రూ. 71,720
వెండి రేట్లు ఇలా
మరోవైపు నేడు వెండి(silver) ధరలు కూడా కిలోకు 100 రూపాయలు పెరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి రేటు రూ. 94,500 కాగా, ముంబైలో కిలో వెండి ధర రూ. 90,000, ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.90,000, చైన్నైలో కిలో వెండి ధర రూ. 94,500, కోల్‌కతాలో కేజీ వెండి ధర రూ. 90,000, కేరళలో కిలో వెండి ధర రూ. 94,500, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 89,500, వడోదరలో కిలో వెండి రేటు రూ. 90,000గా ఉంది.
గమనిక: గోల్డ్, సిల్వర్ రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇది కూడా చదవండి:
ఈ మార్చి చివరినాటికి వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ
చిన్న మొత్తాల పొదుపు రేట్లు యథాతథం
For Latest News and Business News click here