Infosys: వారికి సరైన వేతనాలు ఇవ్వలేకపోయాం.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆవేదన..
ABN , Publish Date - Feb 13 , 2024 | 11:19 AM
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలా కంపెనీలు ఫ్రెషర్ ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలా కంపెనీలు ఫ్రెషర్ ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్ సైతం అందుకు మినహాయింపు కాదని, ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వలేక పోయామని విచారం వ్యక్తం చేశారు. ఒక కంపెనీ మనుగడ సాధించడంలో ప్రారంభ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని తెలిపారు. అలాంటి వారిని విస్మరించడం తగదని హితవు పలికారు. ఇన్ఫోసిస్ సంస్థలో తన కన్నా కో-ఫౌండర్స్ సహకారమే అధికంగా ఉందని చెప్పారు. "ఆన్ అన్ కామన్ లవ్: ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి" పుస్తకావిష్కరణ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
1981 జూలైన పుణెలో స్థాపితమైన ఇన్ఫోసిస్.. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తోంది. నారాయణమూర్తితో సహా నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్, ఎస్డీ శిబులాల్, కే. దినేష్, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరా సహభాగస్వాములుగా ఉన్నారు. కంపెనీ స్థాపనకు నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి ₹10,000 అందించడం విశేషం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.