Vijay Mallya: విజయ్ మాల్యాపై మూడేళ్లపాటు సెబీ నిషేధం.. కారణమిదే

ABN, Publish Date - Jul 27 , 2024 | 11:04 AM

ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా(Vijay Mallya)పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 3 సంవత్సరాల పాటు భారతీయ సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం విధించింది. దీంతో మాల్యా 3 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలు చేయలేరు.

ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా(Vijay Mallya)పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 3 సంవత్సరాల పాటు భారతీయ సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం విధించింది. దీంతో మాల్యా 3 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలు చేయలేరు. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్ యూనిట్లతో సహా మాల్యాకు చెందిన అన్ని సెక్యూరిటీ హోల్డింగ్‌లను స్తంభింపజేయాలని సెబీ ఆదేశించింది.

అంతకుముందు జూన్ 1, 2018 నాటి ఆర్డర్‌లో మాల్యా సెక్యూరిటీల మార్కెట్‌లోకి ప్రవేశించకుండా మూడేళ్లపాటు సెబీ నిషేధించింది. USL డబ్బు దుర్వినియోగం, అన్యాయమైన లావాదేవీల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయ్ మాల్యాకు సంబంధించి సెబీ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి.


విదేశీ ఖాతాలను ఉపయోగించి

మాల్యా తన షేర్ల ట్రేడింగ్‌(shares trading)లో పరోక్షంగా ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో కూడా సెబీ దర్యాప్తు చేస్తోంది. మాల్యా ఎఫ్‌ఐఐ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, భారత్‌లోని తన గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్ కంపెనీలలో సెక్యూరిటీలను తప్పుగా కొనుగోలు చేసి విక్రయించినట్లు వెలుగులోకి వచ్చిందని సెబీ చీఫ్ జనరల్ మేనేజర్ అనితా అనుప్ తెలిపారు. ఇది పెట్టుబడిదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా, మార్కెట్ పెట్టుబడిదారులను మోసం చేయడమే దీని ఉద్దేశమని అన్నారు.

UBS AGతో విదేశీ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి భారతీయ సెక్యూరిటీల మార్కెట్‌కు డబ్బు పంపిన కేసుకు సంబంధించి సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పనిచేయని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన మోసం ఆరోపణలను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం మాల్యాను బ్రిటన్(britain) నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. మాల్యా మార్చి 2016 నుంచి బ్రిటన్‌లోనే నివసిస్తున్నారు.


మాల్యా పేరు దాచి..

మాల్యా తన గుర్తింపును దాచిపెట్టి మ్యాటర్‌హార్న్ వెంచర్స్ అనే ఎఫ్‌పీఐ కంపెనీ ద్వారా పెట్టుబడులు పెట్టారు. ఇది భారతీయ కంపెనీల వాటాదారుల ప్రయోజనాలకు విరుద్ధమని సెబీ పేర్కొంది. సెబీ ఆదేశాల ప్రకారం ఈ ఎఫ్‌పీఐ కంపెనీని హెర్బర్ట్‌సన్స్ యునైటెడ్ స్పిరిట్స్ (USL) వంటి మద్యం కంపెనీల షేర్లలో లావాదేవీలు జరపడానికి ఉపయోగించారు. ఆ క్రమంలో మాటర్‌హార్న్ వెంచర్స్ 9.98 శాతం హెర్బర్ట్‌సన్ షేర్లను కలిగి ఉందని సెబీ గుర్తించింది.

ఇవి వాస్తవానికి ప్రమోటర్ కేటగిరీ, పూర్తిగా మాల్యా ఆధ్వర్యంలో నిధులు సమకూర్చబడ్డాయి. ఆ తర్వాత విజయ్ మాల్యా హెర్బర్ట్‌సన్స్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ షేర్ల కోసం యుబీఎస్ బ్యాంక్‌లో వివిధ పేర్లతో (బేసైడ్, సన్‌కోస్ట్, బిర్చ్‌వుడ్) అనేక ఖాతాలను తెరిచినట్లు సెబీ పరిశీలనలో తేలింది. ఆ నేపథ్యంలో చేసిన ట్రేడింగ్ ద్వారా ఈ మూడు ఖాతాల ద్వారా విజయ్ మాల్యాకు 6.15 మిలియన్ డాలర్లు చేరాయి.


ఇవి కూడా చదవండి:

Rich Stock: ఏడాదిలోనే ధనవంతులను చేసిన టాటా గ్రూప్ స్టాక్.. ఇంకా పెరగనుందా?


ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యమైతే.. ఏమవుతుంది, ఫైన్ ఎంత?


Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే


Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే

Read More Business News and Latest Telugu News

Updated at - Jul 27 , 2024 | 11:09 AM