Vijay Sankeshwar: అప్పు తీసుకున్న మనీతో వ్యాపారం మొదలు..ఇప్పుడతను రూ.6100 కోట్లకు అధిపతి
ABN , Publish Date - Jan 07 , 2024 | 01:24 PM
ఓ వ్యక్తి తాను అనుకున్నది సాధించి ప్రస్తుతం ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. అతను మొదట వ్యాపారం మొదలు పెట్టాలని అనుకోగా..అతని ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయలేదు. అయినా కూడా అతను ఓ వ్యక్తి వద్ద డబ్బులు అప్పు తీసుకుని వ్యాపారం మొదలు పెట్టి ఇప్పుడు ఆరు వేల కోట్లకు అధిపతిగా మారారు. అతని విజయ గాథ గురించి ఇప్పుడు చుద్దాం.
మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని చెబుతుంటారు. ఇతని గురించి చెబితే అవును నిజమే అనిపిస్తుంది. అంతేకాదు ఇతని కథ ప్రస్తుతం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది. అతనే విజయ్ సంకేశ్వర్(Vijay Sankeshwar) ఒకప్పుడు అప్పులు చేసి ఓ ట్రక్కు కొనుగోలు చేసి ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం ప్రారంభించాడు. కానీ ఇప్పుడు దాదాపు 5700లకుపైగా ట్రక్కులను కల్గి ఉన్నారు. కానీ ఈ స్థాయికి చేరుకునే ప్రయాణం అంత సులభం కాదు. అయినప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొని నేడు అతను దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీ అయిన VRL లాజిస్టిక్స్ యజమానిగా కొనసాగుతున్నారు. అంతేకాదు సంకేశ్వర్ కంపెనీ గత ఐదేళ్లలో స్టాక్ మార్కెట్‌లో 115 శాతం రాబడినిచ్చింది. దీంతో అతని కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ ప్రస్తుతం రూ.6142 కోట్లకు చేరింది. సంకేశ్వర్ కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో జన్మించారు.
విజయ్ సంకేశ్వర్ మొదట 1970లలో రవాణా వ్యాపారంలోకి రావాలని మొదట అనుకున్నాడు. ఆ క్రమంలోనే తన సొంత లాజిస్టిక్స్ సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అయితే విజయ్ రవాణా వ్యాపారంలోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదు. దీంతో అతనికి తన కుటుంబం నుంచి ఆర్థిక మద్దతు లభించలేదు. దీంతో 1976లో విజయ్ తన పరిచయస్థుడి వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఒక ట్రక్కును కొని లాంఛనంగా తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో విజయ్‌కి ఈ వ్యాపారం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే అతను టెక్నాలజీ లేని సమయంలో ఈ వ్యాపారం ప్రారంభించాడు. నేటి లాగా డ్రైవర్ల నుంచి కస్టమర్ల వరకు ప్రతిదీ నిర్వహించడానికి ఆ సమయంలో టెక్ సపోర్ట్ లేదు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Tata Punch EV: టాటా పంచ్ EV కార్ల కోసం బుకింగ్స్ షురూ..రేటు కూడా తక్కువే!
ఒక ట్రక్కు నుంచి 5671 ట్రక్కుల వరకు తన ప్రయాణంలో విజయ్ చాలాసార్లు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అతను తన సంస్థ విజయానంద్ రోడ్‌లైన్స్‌తో ఈ రంగంలో విజయం సాధించాలని నిశ్చయించుకున్నాడు. కంపెనీ మొదట 1994లో దాని పేరును VRLగా మార్చినప్పుడు దాని ప్రస్తుత రూపాన్ని పొందడం ప్రారంభించింది. ఆ సమయానికి కంపెనీకి 150 ట్రక్కులు ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ కంపెనీకి 5671 రవాణా వాహనాలు ఉన్నాయి. అనేక సవాళ్లను ఎదుర్కొని విజయ్ నేడు కోట్ల రూపాయల సంస్థకు అధిపతిగా మారారు.