Share News

Savings Scheme: పోస్టాఫీస్ RDలో నెలకు రూ.5 వేలు పొదుపు చేస్తే ఎంత లాభం.. మధ్యలో తీసుకోవచ్చా..

ABN , Publish Date - Aug 04 , 2024 | 03:55 PM

పోస్టాఫీస్(post ofice) అనేక రకాల పొదుపు పథకాలను నిర్వహిస్తుంది. వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రజలు మంచి రాబడిని పొందుతున్నారు. మీరు కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, మంచి రాబడిని పొందవచ్చు. వాటిలో ఒకటి RD పథకం. దీనిలో ప్రతి నెలా కొద్ది మొత్తంలో డిపాజిట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు.

Savings Scheme: పోస్టాఫీస్ RDలో నెలకు రూ.5 వేలు పొదుపు చేస్తే ఎంత లాభం.. మధ్యలో తీసుకోవచ్చా..
post office RD savings scheme

పోస్టాఫీస్(post ofice) అనేక రకాల పొదుపు పథకాలను నిర్వహిస్తుంది. వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రజలు మంచి రాబడిని పొందుతున్నారు. మీరు కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, మంచి రాబడిని పొందవచ్చు. ఇందులో మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు హామీతో కూడిన రాబడిని పొందుతారు. అందుకే గత కొంత కాలంగా అనేక మంది పోస్టాఫీస్ సేవింగ్ స్కీంలలో(saving schemes) పెట్టుబడులు(investments) చేస్తున్నారు. వాటిలో ఒకటి RD పథకం. దీనిలో ప్రతి నెలా కొద్ది మొత్తంలో డిపాజిట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు. RDని 'రికరింగ్ డిపాజిట్' అని పిలుస్తారు.


మధ్యలో తీసుకోవచ్చా..

ఇది సురక్షితమైన పెట్టుబడి పథకం. RD స్కీం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత మీరు మెచ్యూర్ క్లోజ్ చేసుకోవడం ద్వారా వడ్డీతో పాటు మీ మొత్తం డబ్బును పొందవచ్చు. మీకు కావాలంటే మీరు దానిని తదుపరి 5 సంవత్సరాలు కూడా పొడిగించుకోవచ్చు. ఈ స్కీంలో 3 సంవత్సరాల తర్వాత కూడా అకాల మూసివేత సౌకర్యాన్ని అందిస్తున్నారు. పోస్టాఫీస్ RD స్కీమ్ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఇటివల పెంచింది. మీరు ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఇప్పుడు మీకు 7.5% వడ్డీ రేటు లభిస్తుంది. గతంలో ఇది 6.7 శాతంగా ఉండేది. ఈ పొదుపు పథకం వడ్డీ రేటును ప్రతి 3 నెలలకు ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Market Outlook: వచ్చేవారం స్టాక్ మార్కెట్‌ తీరును నిర్ణయించే అంశాలివే..


ఎంత వస్తుంది

అయితే పోస్టాఫీసు RD స్కీమ్‌లో నెలకు రూ.5000 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఎంత రాబడి పొందుతారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. మీరు పోస్టాఫీసు ఆర్డీ పథకంలో ప్రతి నెలా రూ. 5000 పెట్టుబడి చేస్తే 5 సంవత్సరాల పాటు రూ. 3 లక్షలు జమ చేస్తారు. ఆ క్రమంలో మీరు రూ. 3 లక్షల డిపాజిట్ మొత్తంపై 7.5% వడ్డీ రేటుతో డబ్బును పొందినట్లయితే మీకు వడ్డీ రూ. 64,448 జమ అవుతుంది. ఆ విధంగా మెచ్యూరిటీ సమయం ఐదేళ్లు పూర్తయిన తర్వాత మీరు మొత్తం రూ.3,64,448 పొందుతారు. ఒక వేళ నెలకు వెయ్యి లేదా మూడు వేల రూపాయలు చెల్లిస్తే ఎంత మొత్తం వస్తుందనే విషయాలను ఈ క్రింద చూడవచ్చు.

పోస్ట్ ఆఫీస్ RD పథకం నెలవారీ వాయిదా

నెల డిపాజిట్ 5 ఏళ్లకు వడ్డీ వచ్చే మొత్తం

రూ. 1000 - రూ. 60,000 - రూ. 12,886 - రూ. 72,886

రూ. 3000 - రూ. 1,80,000 - రూ. 38,666 - రూ. 2,18,666

రూ. 5000 - రూ. 3,00,000 - రూ. 64,448 - రూ. 3,64,448


ఇవి కూడా చదవండి:

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


ITR Filing: జరిమానాతో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఇన్ని నష్టాలున్నాయా..!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 04 , 2024 | 03:57 PM